Manchu Mohanbabu: మంచు కుటుంబంలో మళ్ళీ అగ్గి రాజుకుంది. నేడు మంచు మనోజ్ తన అవ్వా, తాతల సమాధులకు నివాళి అరిపించడానికి రేణిగుంట విమానాశ్రయం నుండి 200 మంది అభిమానులతో కారు ర్యాలీతో బయలుదేరాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే యూనివర్సిటీ కి చేరుకొని మంచు మనోజ్ ని నిలువరించారు. తన అవ్వా తాతల సమాధులకు నివాళి అర్పించేందుకు వచ్చిన తనని అడ్డుకునేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని మనోజ్ మొండికేసి అక్కడే కూర్చున్నాడు. ఆయనతో పాటు వచ్చిన అభిమానులు యూనివర్సిటీ గేట్లు ఎక్కి వీరంగం సృష్టించారు. పోలీసులు వారిపై తీవ్ర స్థాయిలో లాఠీ ఛార్జ్ కూడా చేసారు. గందరగోళం వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కేవలం మనోజ్, అతని భార్య మౌనికలను లోపలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోయి, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ని కలిశారు. ఇదంతా పక్కన పెడితే మనోజ్ చేసిన ఈ చర్యలపై మోహన్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
మనోజ్ కోర్టు ఆదేశాలను దిక్కరించాడని, 200 మంది రౌడీ మూకలతో యూనివర్సిటీ లోకి ప్రవేశించి గొడవ చేయాలని చూశాడని, న్యాయస్థానం ఆదేశాల మేరకు వర్సిటీలోకి ప్రవేశం లేదు అని పోలీసులు అతనికి చెప్పినప్పటికీ కూడా మాట వినలేదని, ఈ ఘ్రాణపై తక్షణమే మనోజ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు మోహన్ బాబు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గత నెల మొత్తం ఈ గొడవే న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. అనేక మంది నెటిజెన్స్ మాకేంటి ప్రతీ రోజు ఈ న్యూసెన్స్ అని మండిపడ్డారు. ఎట్టకేలకు ఈ గొడవలు చల్లరాయి అని అనుకునే సమయానికి మళ్ళీ ఈ ఘటన చర్చలకు దారి తీసింది. మరి ఈ ఘటన పట్ల పోలీసులు మనోజ్ పై చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
అయితే నేడు ఆయన నారా లోకేష్ ని కలవడం పై మీడియా లో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. కొద్దిరోజుల క్రితమే ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో చేరబోతున్నాడని, త్వరలోనే పవన్ కళ్యాణ్ తో చర్చించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు టీడీపీ లో చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ భార్య మౌనిక అక్క అఖిల ప్రియా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉంది. మనోజ్ చాలా కాలం నుండి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో ఒకసారి చర్చలు కూడా జరిపాడు కానీ, ఆ పార్టీ లో చేరుతున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా లోకేష్ తో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క ఆయన వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ‘మిరాయ్’, ‘భైరవం’ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఆయన ‘వాట్ ది ఫిష్’ అనే చిత్రంలో హీరో గా నటిస్తున్నాడు.