Manchu Vishnu: నటుడు మోహన్ బాబు తన పెద్ద కుమారుడు విష్ణుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మధ్య కాలంలో మంచు కుటుంబంలో చోటు చేసుకున్న అనివార్య సంఘటనల రీత్యా ఈ భేటీ చర్చకు దారి తీసింది. అలాగే వచ్చే నెలలో కన్నప్ప విడుదల ఉంది. సీఎం ని మోహన్ బాబు, విష్ణు కలవడం వెనుక ఆంతర్యం ఏమిటో చూద్దాం..
Also Read: మన స్టార్ హీరోలు బిజీగా ఉండటం వల్ల తెలుగు డైరెక్టర్లతో సినిమాలు సెట్ చేస్తున్న తమిళ్ హీరో…
ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించిన మోహన్ బాబు, నిర్మాతగా కూడా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో కూడా రాణించారు. ఇండస్ట్రీ పెద్దల్లో ఒకరిగా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి. చిన్న కుమారుడు మనోజ్ తండ్రితో ఫైట్ చేస్తున్నాడు. మంచు విష్ణు,మోహన్ బాబు ఒకవైపు మనోజ్ మరొకవైపు చేరి గొడవలు పడుతున్నారు. సాధారణంగా ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. మనస్పర్థలు తలెత్తుతాయి. పబ్లిక్ ఇమేజ్ ఉన్న సెలెబ్రిటీలు ఈ ఫ్యామిలీ గొడవలు బయటకు రాకుండా జాగ్రత్త పడతారు. నాలుగు గోడల మధ్య సెటిల్ చేసుకుంటారు.
మంచు ఫ్యామిలీ వివాదాలు రచ్చకెక్కాయి. ఒకరిపై మరొకరు భౌతిక దాడులు చేసుకునే స్థాయికి వారు దిగజారారు. మోహన్ బాబు తనపై దాడి చేయించాడని మనోజ్ ఆరోపణలు చేయగా, మనోజ్ నుండి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీసులను ఆశ్రయించాడు. జుల్పల్లి ఫార్మ్ హౌస్ వేదికగా జరిగిన గొడవలు మీడియాలో హైలెట్ అయ్యాయి. మోహన్ బాబు లైసెన్స్డ్ రివాల్వర్స్ తో హల్చల్ చేశాడు. ఈ క్రమంలో ఆయన టీవీ 9 ప్రతినిధి పై దాడి చేయడం వివాదమైంది. కేసు పెట్టడంతో మోహన్ బాబు అరెస్ట్ నుండి తృటిలో తప్పుకున్నారు. కొన్నిరోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాడని కథనాలు వెలువడ్డాయి.
ఇప్పటికీ మనోజ్ తో వివాదాలు కొనసాగుతున్నాయి. మేజిస్ట్రేట్ ఎదుటే తండ్రీకొడుకు తిట్టుకున్నారట. మరోవైపు మంచు విష్ణు నటించిన కన్నప్ప విడుదలకు సిద్ధం అవుతుంది. ఏప్రిల్ 25న కన్నప్ప థియేటర్స్ లోకి రానుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కాగా మోహన్ బాబు, విష్ణు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనను గౌరవించుకున్నారు.
వివాదాల నడుమ సీఎం రేవంత్ రెడ్డిని మోహన్ బాబు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కన్నప్ప మూవీకి తెలంగాణ ప్రభుత్వం నుండి సహకారం పొందేందుకే అని పలువురు భావిస్తున్నారు. టాలీవుడ్ పట్ల రేవంత్ రెడ్డికి సదాభిప్రాయం లేదు. అల్లు అర్జున్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆయన్ని దుయ్యబట్టారు. అసలు టికెట్స్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు అని అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు. అయితే మెత్తబడ్డ రేవంత్ రెడ్డి ఇటీవల విడుదలైన సినిమాలకు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చాడు. కన్నప్పకు కూడా ఇలాంటి అనుకూలతల విషయంలో ఆయన సహకారం కోసం మోహన్ బాబు, విష్ణు కలిసి ఉంటారు.
సీనియర్ నటుడు శ్రీ ఎం. మోహన్ బాబు,
మా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ మంచు విష్ణు
మర్యాదపూర్వకంగా కలిశారు. pic.twitter.com/nCPUPysGkk— Revanth Reddy (@revanth_anumula) March 11, 2025