Manchu Manoj: మంచు కుటుంబం లో జరుగుతన్న వివాదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో గత రెండు రోజులుగా మనం మీడియా లో చూస్తూనే ఉన్నాం. తండ్రిని దైవం లాగా భావించి ఎన్నో సందర్భాల్లో ఎంతో గొప్ప మాట్లాడిన మంచు మనోజ్, మోహన్ బాబు పై కేసు వేయడం ఏమిటి?, ఆస్తి కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పరువు మర్యాదలను రోడ్డు మీద పెడుతారా వంటి కామెంట్స్ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న మనోజ్ తన కూతురు కోసం ఇంటికి రావడం. లోపలకు వెళ్తున్న అతన్ని గేట్ దగ్గరే సెక్యూరిటీ తో ఆపేయడం. అనంతరం లోపలకు వెళ్లిన తర్వాత ఘర్షణ జరగడం, ఆ సమయంలో బయటకి వచ్చిన మోహన్ బాబు ని మీడియా ప్రశ్నించడం, ఆయన వారిని బూతులు తిడుతూ మైక్ తో రిపోర్టర్ మీద దాడి చేయడం, అనంతరం మంచు మనోజ్ పై అభియోగాలు వేస్తూ మోహన్ బాబు ఒక ఆడియో ని విడుదల చేయడం వంటి సంఘటనలు సంచలనం గా మారాయి.
అయితే కాసేపటి క్రితమే మంచు మనోజ్ మీడియా తో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నాకోసం వచ్చిన మీడియా మిత్రులకు నిన్న జరిగిన సంఘటన నన్ను చాలా బాధించింది. నేను వాళ్లకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. మా నాన్న అంటే నాకు ప్రాణం, ఆయన దేవుడితో సమానం, కేవలం ఆయన మా అన్నయ్య విష్ణు, వినయ్ ట్రాప్ పడ్డాడు, నన్ను మా నాన్న దృష్టిలో వాళ్ళు శత్రువుని చేసి చూపించారు. నేను ఆస్తి కోసం ఎలాంటి గొడవ చేయలేదు, నా సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నాను. నేను నా భార్య తో కలిసి ఉండడం ఇష్టం లేక నాతో ప్రారంభించిన ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని నిర్దాక్షణంగా మధ్యలోనే ఆపించేసారు. అయినప్పటికీ నేను నా సొంత కాళ్ళ మీదనే నిలబడాలని అనుకున్నాను. నా భార్య కూడా ఆమె ఇంటి నుండి ఏమి తీసుకొని రాలేదు. నేను నా భార్య కలిసి ఒక టాయ్ కంపెనీ ని పెట్టాము. వాటికి కూడా అడ్డంకులు సృష్టించారు’ అంటూ మంచు మనోజ్ ఆరోపించాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న ముందే నాన్నను కొట్టారు..నాకు సపోర్టు చేస్తున్న మా అమ్మని కూడా డైవర్ట్ చేసారు. మా అమ్మ ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యిందని నిన్న మా నాన్న అబద్దం చెప్పారు. మూడు రోజులు బయటకు వెళ్లి, మనోజ్ కి సర్దిచెప్తాము అని చెప్పి ఆమెని నమ్మించారు. ఈ గొడవల కారణంగా ఆమెకి కాస్త నలత గా అనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకొని వచ్చింది. ఈ ఘటనలో ఏ సంబంధం లేని నా భార్య ని లాగుతున్నారు, 7 నెలల పసిబిడ్డని కూడా వదలడం లేదు. ఇన్ని రోజులు నోరు విప్పకుండా ఆగాను. ఇప్పటికీ ఆగితే నేను తప్పు చేసినవాడిని అవుతాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ లో అన్నీ ఆధారాలతో సహా బయటపెడుతాను’ అని చెప్పుకొచ్చాడు మనోజ్.