Actor Sunil: తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గాను, హీరో గాను తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్. తనదైన మార్క్ కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలడు సునీల్. విలన్ అవుదామని వచ్చి కమెడియన్‌గా టాప్ లెవల్‌కు వెళ్లిపోయాడు. నువ్వే కావాలి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన సునీల్… నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయ్యాడు. అప్పట్లో ఏడాదికి దాదాపు 20 సినిమాలకు పైగానే నటించాడు.
కాగా ప్రస్తుతం కమెడియన్ గానే నటిస్తూ … పలు సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా లో సునీల్ బ్లాక్ అండ్ వైట్ లో ఒక ఫోటో ను షేర్ చేశాడు. సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఈ ఫోటో కి క్యాప్షన్ పెట్టాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పై ఆయన అభిమానులు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ ఫోటో పై మంచు మనోజ్ స్పందించాడు. ” పిక్ అదిరింది అన్న … లవ్ యూ ” అంటూ రీట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక సునిల్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే సుకుమార్ , ఆలు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలానే ధనరాజ్ తో కలిసి బుజ్జి ఇలా రా అనే సినిమా లోనూ నటిస్తున్నాడు. హరీష్ శంకర్ కథ అందిస్తున్న వేదాంతం రాఘవయ్యాలో చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. వసృస సినిమాలతో దూసుకుపోతూ సునీల్ ఫుల్ ఫామ్ లో ఉన్నదని చెప్పాలి.
Pic Adhirindhi Anna 🤗❤️ love you 🙂 https://t.co/txnKEnKRat
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 26, 2021