RRR-Manchu Manoj Viral Video: తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్'(Mirai Movie) బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి మూవీ టీం తో పాటు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, అదే విధంగా సినిమాటోగ్రఫీ మరియు టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ సినిమా గురించి చెప్పుకొచ్చారు. సినిమాల పై మొదటి నుండి RRR కి మక్కువ ఉండే సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీ లో ప్రముఖ హీరోలందరూ ఆయనకు సుపరిచితమే. అలా నిన్న ఆయన మంచు మనోజ్ తో జరిపిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడే తన కంచు కంఠం తో, మంచు మనోజ్ కంటే బేస్ వాయిస్ తో మా కందుల దుర్గేష్ గారు మాట్లాడి వెళ్లిపోయారు. ఆయన మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత నా లాంటి వీక్ వాయిస్ ఉన్నవాళ్ళు మాట్లాడడం చాలా కష్టం. అయినప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఈ చిత్ర నిర్మాత విశ్వప్రసాద్ గారు నాకు అత్యంత ఆప్తులు. నేను సినీ రంగం లో లేకపోయినప్పటికీ ఆయనకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఉంటాను. అప్పుడప్పుడు ఆయనకు కొన్ని కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాను. ఈ సినిమా మాత్రం ఒక విజువల్ వండర్. యువ కథానాయకుడు తేజ సజ్జ చాలా అద్భుతంగా నటించాడు. నాయకుడిని మించిన ప్రతినాయకుడిగా మా మనోజ్ ఇంకా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఉన్నవి విజువల్ ఎఫెక్ట్స్ అని అనుకున్నాము. కానీ లైవ్ లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని తీయడానికి ఎంత కష్టపడ్డారో ఇందాక మనం మేకింగ్ వీడియోస్ లో చూసాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తేజ సజ్జ కి వరుసగా మూడు భారీ హిట్స్ వచ్చినా కూడా ఎక్కడా గర్వం చూపించకుండా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి లాగా అనిపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు. అందరి హీరోల లాగా కాకుండా సంవత్సరానికి ఒక సినిమా కాకుండా, రెండు మూడు సినిమాలు చేయాలి’ అని అంటాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడుతూ ‘హీరోయిన్ అచ్చం AI క్రియేట్ చేసిన అమ్మాయి లాగా అందంగా ఉంది’ అని RRR అనగా, వెంటనే మనోజ్ ఆయన వైపు కామెడీ గా చూస్తాడు. అప్పుడు RRR నవ్వుతు మనోజ్ ని కౌగలించుకుంటాడు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినా ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
RRR ని ఆట పట్టించిన Manoj Manchu#Mirai pic.twitter.com/H6D4tOSNIM
— idlebrain jeevi (@idlebrainjeevi) September 16, 2025