Homeఎంటర్టైన్మెంట్Manchu Manoj: ఆ మీడియా పెద్దాయనకు ఇచ్చిపడేసిన మనోజ్.. మామూలుగా ఇవ్వలేదుగా

Manchu Manoj: ఆ మీడియా పెద్దాయనకు ఇచ్చిపడేసిన మనోజ్.. మామూలుగా ఇవ్వలేదుగా

Manchu Manoj: మంచు బ్రదర్స్ మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల వరకు అంతర్గంగా సాగిన కలహాలు, బహిర్గతం అయ్యాయి. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు మనోజ్ మరోవైపు చేరి, వర్గ పోరాటానికి తెరలేపారు. మోహన్ బాబుకు చెందిన జుల్పల్లి ఫార్మ్ హౌస్ వేదికగా అనేక గొడవలు జరిగాయి. మనోజ్ ని అక్కడ నుండి మోహన్ బాబు బయటకు పంపేశాడు. మనోజ్ చర్యలు అప్పుడప్పుడు వార్తలకు ఎక్కుతున్నాయి. మద్యానికి బానిసైన మనోజ్, భార్య మాటలు వింటూ అనుచిత చర్యలకు పాల్పడుతున్నాడని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా మనోజ్-విష్ణు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఇటీవల ఏలూరులో భైరవం ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేదికపై కుటుంబ విషయాలు లేవనెత్తాడు మనోజ్. ఎప్పటికైనా నేను మోహన్ బాబు కొడుకునే అన్నాడు. అలాగే శివయ్యా.. అంటే శివుడు రాడు, అంటూ పరోక్షంగా విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రాన్ని ట్రోల్ చేశాడు. ఈ వివాదాల నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మనోజ్ కి ఓ ప్రశ్న ఎదురైంది.

సీనియర్ జర్నలిస్ట్ మూర్తి.. మనోజ్ ని ఇంటర్వ్యూ చేశారు. మీరు మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నారా? అని అడగ్గా లేదని మనోజ్ సమాధానం చెప్పాడు. అలాంటప్పుడు మీరు వివాదాలు పూర్తిగా వదిలేయవచ్చు కదా? అని మూర్తి అడిగారు. నేను వదలాలి అనుకున్నా వదలనివ్వరు. ఎవరో ఒకరు గెలుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా.. ఇలానే.. అని మనోజ్ ఒకింత అసహనానికి గురయ్యాడు. సదరు జర్నలిస్ట్ కి ఇచ్చి పడేశాడు. కాంట్రవర్సీ ప్రశ్నలతో మూర్తి తరచుగా వార్తల్లో ఉంటారు.

మరోవైపు భైరవం మూవీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. దర్శకుడు విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్, ఆయన ఓల్డ్ సోషల్ మీడియా పోస్ట్ ఇందుకు కారణం అయ్యాయి. అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు మెగా అభిమానులు భైరవం చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. భైరవం మూవీ మే 30న థియేటర్స్ లోకి రానుంది. తమిళ చిత్రం గరుడన్ కి ఇది రీమేక్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ నటించారు.

 

Orey 🤣🤣 l #manchumanoj #bhairavam #movieupdates #tollywood #telugu #feed
Exit mobile version