Homeఎంటర్టైన్మెంట్Manchu Manoj: అమ్మతోడు నిన్ను వదలను.. అతడికి మంచు మనోజ్ మాస్ వార్నింగ్! మరో వివాదం

Manchu Manoj: అమ్మతోడు నిన్ను వదలను.. అతడికి మంచు మనోజ్ మాస్ వార్నింగ్! మరో వివాదం

Manchu Manoj: మంచు మనోజ్ ఓ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మతోడు నిన్ను వదిలేది లేదని శబధం చేశాడు. మంచు మనోజ్ సోషల్ మీడియా కామెంట్స్ చర్చకు దారితీశాయి. విషయంలోకి వెళితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చైల్డ్ అబ్యూస్ పై మంచు మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. ”పిల్లల విషయంలో నీచమైన కామెంట్స్ చేస్తూ, అసభ్యకర వీడియోలు చేసే వారిని చూస్తే అసహ్యం వేస్తుంది. హాస్యం ముసుగులో ఇలాంటి చర్యలకు పాల్పడటం సమాజానికి ప్రమాదం. దీనిని ఎదుర్కొనేందుకు ఏడాది క్రితం నేను ఓ వ్యక్తిని సంప్రదించాను. అతడు సహాయం చేయకపోగా… తిరిగి అతడే పిల్లల మీద సోషల్ మీడియాలో నీచమైన కామెంట్స్ చేస్తున్నాడు. పిల్లలు, మహిళల సంరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి వారిని ఉపేక్షించవద్దు ” అని మనోజ్ కామెంట్ చేశాడు.

తన సోషల్ మీడియా పోస్ట్ కి తెలుగు రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్స్, ముఖ్యమంత్రులు, అమెరికాలోని ఇండియన్ ఎంబసీని ట్యాగ్ చేశాడు. అలాగే ”అమ్మతోడు నిన్ను వదిలిపెట్టను” అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఈ వివాదం వెనకున్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సాయి ధరమ్ తేజ్ సైతం దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. నియంత్రించలేనంతగా సోషల్ మీడియా మాధ్యమాలు భయానకంగా మారిపోయాయి. మృగాల నుండి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిందండ్రుల మీద ఉంది. పిల్లల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని సాయి ధరమ్ తేజ్ తల్లిందండ్రులకు సూచించారు.

సోషల్ మీడియా మీడియా వలన ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉంది. ముఖ్యంగా అబ్యూస్, హేట్ విపరీతంగా వ్యాపిస్తుంది. సోషల్ మీడియా మోసాలు, అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. హీరోలు, హీరోయిన్స్, వారి కుటుంబ సభ్యులు యాంటీ ఫ్యాన్స్ చేసే సోషల్ మీడియా దాడులకు గురవుతున్నారు. మానసిక వేదన అనుభవిస్తున్నారు. కొందరు సెలెబ్స్ సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కొందరు తప్పక సోషల్ మీడియాలో కొనసాగుతున్నారు.

RELATED ARTICLES

Most Popular