Manchu Manoj : మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ట్రోల్స్ కి గురి కాకుండా, నటుడిగా, ఒక మంచి వ్యక్తిగా ప్రేక్షకాదరణ పొందిన నటుడు మంచు మనోజ్(Manchu Manoj). సుమారుగా ఈయన సినిమాలకు దూరమై 9 ఏళ్ళు కావొస్తుంది. ఈ 9 ఏళ్లలో ఆయన తనకు నచ్చినట్టుగా బ్రతికాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కాస్త స్థిరపడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈసారి కేవలం ఆయన హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాదల్చుకోలేదు. క్యారక్టర్ రోల్స్ కూడా చేయడానికి సిద్దమయ్యాడు. రీసెంట్ గా అయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), నారా రోహిత్(Nara Rohit) లతో కలిసి ‘భైరవం'(Bhairavam Movie) అనే చిత్రం చేసాడు. ఈ నెల 30వ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా మంచు మనోజ్ ప్రొమోషన్స్ లో ఫుల్ యాక్టీవ్ గా పాల్గొంటున్నాడు.
Also Read : “నా అంతరాత్మ చెప్పిందే వింటాను!”..’స్పిరిట్’ వివాదంపై దీపికా పదుకొనే బాంబ్
రీసెంట్ గానే ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ సమయంలో మనోజ్ పవన్ కళ్యాణ్ ని కలిసిన ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆరోజు పవన్ కళ్యాణ్ మీతో ఏమి మాట్లాడాడు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మనోజ్ సమాధానం చెప్తూ ‘ఆరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లొకేషన్ కి రమ్మని నాకు కాల్ చేశారు. వెళ్లిన తర్వాత ఆయన నాతో మాట్లాడుతూ అసలు ఏమైపోయావు నువ్వు. ఈమధ్య కనిపించడం లేదు అని అడిగాడు. అప్పుడు నేను చెన్నై లో ఉంటున్నాను సార్ అని అన్నాను. దానికి ఆయన ఆశ్చర్యపోతూ నా చెయ్యి పట్టుకొని పక్కకి తీసుకెళ్లారు’.
‘చెన్నై కి ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడిగాడు. నా జీవితం లో మౌనిక అనే అమ్మాయి ఉంది సార్. తనతో నేను ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అందుకే చెన్నై కి వెళ్లి కాస్త స్థిరపడిన తర్వాత తిరిగి ఇక్కడికి రావాలని అనుకున్నాను అని చెప్పాను. అప్పుడు ఆయన నాకు గంటసేపు క్లాస్ పీకాడు. ఇలా కాదు నేను ఒకసారి చెన్నై కి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను. కలుస్తాను. ముందుగా నువ్వు సన్నగా అవ్వు, చాలా లావుగా ఉన్నావు,ఎదో ఒకటి చేసి ముందు శరీరాన్ని తగ్గించు, నువ్వు మళ్ళీ ఇండస్ట్రీ లోకి రావాలి, మంచి నటుడివి కేవలం హీరో పాత్రలకే పరిమితం అవ్వకు, రకరకాల క్యారెక్టర్స్ ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. ఆరోజు ఆయన అలా చెప్పిన మాటలు నన్ను చాలా ప్రభావితం చేశాయి, అప్పటి నుండే మల్టీస్టార్రర్స్ తో పాటు ఎలాంటి సినిమా అయినా చేయడానికి సిద్దమైపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు