
Manchu Manoj : ఈరోజు ఉదయం అందరిని షాక్ కి గురి చేసిన విషయం ఏమిటంటే మంచు బ్రదర్స్ ఇద్దరూ గొడవలు పడడం.మంచు విష్ణు నేరుగా మంచు మనోజ్ ఇంటికి వచ్చి అతనిని కొట్టడానికి మీదకి వసున్న వీడియో ని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసాడు.ఎప్పుడైతే ఆయన ఆ పని చేసాడో మీడియా మొత్తం ఆ వీడియో గురించి మాట్లాడుకోవడం జరిగింది.
నెటిజెన్స్ కూడా ఎన్ని గొడవలు ఉన్నా మీ మధ్యనే చూసుకోవాలి కానీ, రోడ్డు మీదకి తీసుకొని రావడం ఏమిటి..?, ఏమి ఫ్యామిలీ బాబూ మీది అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు..మోహన్ బాబు కూడా ఈ విషయం పై తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేసాడు.వీళ్ళ మధ్య గొడవ ఎప్పుడు సర్దుమణుగుతుందో ఇప్పుడే చెప్పలేము కానీ, మనోజ్ మాత్రం అసలు ఏమి జరగనట్టే ఉంటూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ వెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నేడు తమిళ స్టార్ హీరో అజిత్ కన్నతండ్రి పీ.సుబ్రహ్మణ్యం చనిపోయిన సంగతి తెలిసిందే.ఆయనకీ సంతాపం గా సోషల్ మీడియా లో ఉన్న అభిమానులు మరియు సెలెబ్రిటీలు పోస్టులు వేశారు.అలా మనోజ్ కూడా సాయంత్రం ట్విట్టర్ కి వచ్చి ‘సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాను, ఈ సందర్భంగా అజిత్ గారికి ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ఒక ట్వీట్ వేసాడు.ఈ ట్వీట్ క్రింద నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపించారు.చెయ్యాల్సిన విద్వంసం మొత్తం చేసేసి, ఇప్పుడు ఏమీ తెలియనట్టు వచ్చావా అంటూ కామెంట్ చేస్తున్నారు.
వీళ్లిద్దరి మధ్య గొడవలు ముదిరి మరోసారి రోడ్డు మీదకు ఎక్కకముందే మోహన్ బాబు సమస్య పరిష్కరించి ఇద్దరినీ కూల్ చేస్తాడో లేదో చూడాలి.చాలాకాలం నుండి వీళ్లిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియా లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అది చాలా మంది పుకారు అనుకున్నారు కానీ, అనుకున్న దానికంటే ఎక్కువగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తుంది.