Manchu Family:’మంచు ఫ్యామిలీ’ గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు ట్రోలింగ్ కి గురి అవుతూ వస్తోంది. కోపం వస్తే.. మోహన్ బాబు వృద్ధ సింహంలా బూతులతో గర్జిస్తున్నారు. ఎక్కువ చేస్తే చీరేస్తా అంటూ రెచ్చిపోతున్నారు. అయితే, బయట వాళ్ల పైనే కాదు, ఇంట్లో వాళ్ళ పై కూడా మోహన్ బాబు నోరు అదుపులో ఉండటం లేదట.

మంచు మనోజ్ చాలాకాలంగా మంచు ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. మోహన్ బాబు సీరియస్ కామెంట్స్ కి మనోజ్ మనసు గాయపడిందని, ఇద్దరి మధ్య గ్యాప్ భారీగా పెరిగిపోయిందని టాక్ నడుస్తోంది. దీనికితోడు మోహన్ బాబు ప్రధాన బిజినెస్ లు విద్యాసంస్థలతో పాటు తిరుపతిలో ఉన్న హోటల్స్ ను కూడా మంచు విష్ణునే చూసుకుంటున్నాడు.
వాటి పై వచ్చే డబ్బుతోనే విష్ణు ’24 ఫ్రేమ్స్’ అని ఓన్ గా ఒక నిర్మాణ సంస్థ పెట్టి తాను హీరోగా వరుస ప్లాప్ సినిమాలు చేస్తున్నాడు. మరోపక్క అన్నీ ఉన్నా అదృష్టం లేని వ్యక్తిగా మిగిలిపోయాడు మనోజ్. స్టార్ హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా.. ప్రస్తుతం నిర్మాతలు మనోజ్ కి దూరం జరిగారు.
ఇలాంటి పరిస్థితుల్లో ‘ఎమ్ఎమ్ ఆర్ట్స్’ పేరుతో ఒక సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తాను హీరోగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గత రెండేళ్ల నుంచి ఎన్నో ఆర్థిక కష్టాల మధ్య ఆగుతూ సాగుతూ ఉంది. అయితే, ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురావాలని, మనోజ్ తన మార్కెట్ కి మించి ఈ సినిమా కోసం ఖర్చుపెడుతున్నాడు .

దాంతో సినిమాకు అనుకున్న దాని కంటే ఓవర్ బడ్జెట్ అయ్యింది. నిర్మాణ సాయం చేస్తా అని మొదట హామీ ఇచ్చిన మంచు విష్ణు.. కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పిన ఈ కథ బాగాలేదు అని సైలెంట్ అయ్యిపోయాడు. ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెడితే పెట్టావు, పాన్ ఇండియా పేరుతో ఓవర్ బడ్జెట్ నిన్ను ఎవ్వరు చేయమన్నారు అంటూ మనోజ్ పై మోహన్ బాబు కూడా బాగా సీరియస్ ఉన్నాడు.
మధ్యలో బడ్జెట్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తన సినిమాకు తన ఫ్యామిలీ నుంచే సరైన సపోర్ట్ లేదనే బాధ మనోజ్ లో రోజురోజుకు ఎక్కువ అవుతుందట. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ వదిలేసి.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తున్న సినిమా ‘అహం బ్రహ్మాస్మి’.
పైగా గట్టిగా పది కోట్లు కూడా మార్కెట్ లేని మనోజ్ కి.. పాన్ ఇండియా మూవీ ఏ మాత్రం వర్కౌట్ కాదు అని మంచు ఫ్యామిలీనే తీర్మానం చేస్తూ ప్రస్తుతానికి అయితే మనోజ్ కి సహాయనిరాకరణ చేస్తోంది. దాంతో ‘అహం బ్రహ్మాస్మి’ షూటింగ్ రెండు రోజులు జరిగితే.. మళ్ళీ రెండు నెలలు గ్యాప్ వస్తోంది. అందుకే, మంచు ఫ్యామిలీ మనోజ్ ను ముంచేసిందనే కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి
[…] Sri Lanka Financial Crisis 2022: మన పొరుగు దేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాుతోంది. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగి పోయాయి. బియ్యం నిల్వలు నిండుకున్నాయి. దీంతో ప్రజలు బియ్యం కొనుగోలు చేయడానికి కిలోమీటర్ల మేర క్యూలో నిలబడటం తెలిసిందే. చమురు ధరలైతే చుక్కులు చూపిస్తున్నాయి. ఫలితంగా దేశం యావత్తు తీవ్ర కరువు ఎదుర్కొంటోంది. ప్రజలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరు మన దేశానికి శరణార్థులుగా వస్తున్నారు. తమిళనాడుకు వచ్చి తలదాచుకుంటున్నారు. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. […]