Mohan Babu-Manchu Manoj : గత కొంత కాలం నుండి మంచు మోహన్ బాబు కుటుంబం లో ఆస్తుల విషయంలో పెద్ద గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో మంచు మనోజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో విష్ణు తనపై దాడి చేసేందుకు వచ్చిన వీడియో ని స్టోరీ లో పెట్టి పెద్ద దుమారం రేపాడు. ఈ ఘటన తర్వాత నిన్న రాత్రి మళ్ళీ వీళ్ళ కుటుంబంలో గొడవలు జరిగినట్టు తెలుస్తుంది. మంచు మోహన్ బాబు మనోజ్ పై చెయ్యి చేసుకున్నాడని, ఆ తర్వాత మనోజ్ కూడా తన తండ్రిపై తిరగబడ్డారని, దీంతో వీళ్లిద్దరు ఇప్పుడు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఫిర్యాదులో మనోజ్ మోహన్ బాబు పై సంచలన ఆరోపణలు చేస్తూ తన తండ్రి నాపై అలాగే నా భార్య మౌనిక రెడ్డి పై దాడి చేసాడని చెప్పుకొచ్చాడు.
ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే రేపింది. క్రమశిక్షణకి మారుపేరు లాంటి మోహన్ బాబు కుటుంబం లో ఇలాంటి సంఘటనలు రిపీట్ గా చోటు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆస్తుల విషయం లో వీళ్ళ మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. మోహన్ బాబు మనోజ్ రెండవ పెళ్ళికి తండ్రి స్థానం లో కూర్చొని చెయ్యాల్సిన కార్యక్రమాలు మొత్తం చేసాడు. విష్ణు తో గొడవ జరిగిన కొన్నాళ్ళకు మోహన్ బాబు పుట్టినరోజు నాడు మనోజ్ ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు. వీళ్ళ మధ్య అందరూ అనుకున్న స్థాయిలో విబేధాలు లేవు, ఉన్నా కూడా అవి మామూలివే అని అంతా అనుకున్నారు. కానీ కన్న తండ్రిపై మనోజ్, కన్న కొడుకుపై మోహన్ బాబు కేసులు వేసుకునే స్థాయికి గొడవలు చేరాయంటే, భవిష్యత్తులో మనోజ్ ప్రెస్ మీట్ పెట్టి తన తండ్రి పై విరుచుకుపడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.