Manchu Manoj-journalist Murthy: ఇటీవల కాలం లో మంచు మనోజ్(Manchu Manoj) చాలా సంతోషంగా ఉంటున్నాడు. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఆయన సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ‘భైరవం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద రేంజ్ లో ఆడకపోయినప్పటికీ మంచు మనోజ్ క్యారక్టర్ కి మంచి పేరు వచ్చింది. కానీ రీసెంట్ గా విడుదలైన ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం మాత్రం ఆయనకు మంచి పేరు తీసుకొని రావడమే కాకుండా, కమర్షియల్ గా కూడా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో మనోజ్ పట్టరాని ఆనందం లో ఉన్నాడు. గత రెండేళ్లు గా తన కుటుంబం లో జరుగుతున్న గొడవలకు మనోజ్ ఎంతలా నలిగిపోయాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయం లో మిరాయ్ హిట్ ఆయనకు మంచి బూస్ట్ ని ఇచ్చింది. ప్రతీ సందర్భం లోనూ ఆయన తన ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు.
రీసెంట్ గా ఆయన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఫోన్ ని చూస్తూ, వామ్మో అని ఆశ్చర్యపోతూ కొన్ని రియాక్షన్స్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీని నిన్న మనోజ్ తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మూర్తి అడుగుతూ ‘నా ఫోన్ లో అంత దొంగచాటుగా ఏమి చూశారు?, అలా చూడడం తప్పు కదా’ అని అంటాడు. అప్పుడు మనోజ్ దానికి సమాధానం చెప్తూ ‘మరి ఈ వయస్సు లో మీరు టిన్డర్ డేటింగ్ యాప్ చూడడం కరెక్టా చెప్పండి?’ అని అంటాడు. అసలు ఆ యాప్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, మీరు మా కుటుంబం లో చిచ్చు పెట్టేలా ఉన్నారే అంటూ మూర్తి సరదాగా కౌంటర్ ఇస్తాడు. మీరు చెప్పారు కదా, ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూస్తాను ఆ యాప్ ఏంటో అని మూర్తి కామెంట్స్ చేయడం చాలా ఫన్నీ గా అనిపించింది.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే ‘మిరాయ్’ చిత్రం తేజ సజ్జ కి భవిష్యత్తులో ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ, మంచు మనోజ్ కి మాత్రం బాగా ఉపయోగపడుతుంది అనే చెప్పాలి. ఆయన క్యారక్టర్ ఇందులో హీరో కంటే పవర్ ఫుల్ గా ఉంటుంది. ఆయన్ని కొట్టేవాళ్ళు ఈ భూమి మీద పుట్టలేదు, కొట్టాలంటే దేవుడు దిగి రావాలి అనే రేంజ్ క్యారక్టర్ చేసాడు మంచు మనోజ్. ఇది ఆయనకు చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఆయనకు హీరో గా చెయ్యాలన్నా, మళ్లీ ఇలాంటి పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్స్ చెయ్యాలన్నా, మంచి ఉత్సాహం, ఎనర్జీ, జోష్ వచ్చింది అనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది చూడాలి.
Thatha pic.twitter.com/HUblqpSOdk
— solo batuke so better 1845 (@SivakishorePal7) September 16, 2025