Lakshmi Manchu: నైట్ వేర్లో ప్యాంటు లేకుండా మంచు లక్ష్మి.. మైండ్ బ్లోయింగ్ లుక్ వైరల్

మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. ఆమె హీరోయిన్ కావాలని అనుకున్నారు. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది.

Written By: NARESH, Updated On : November 22, 2023 2:02 pm

Lakshmi Manchu

Follow us on

Lakshmi Manchu: మంచు లక్ష్మి కొత్త ఇమేజ్ కోరుకుంటుంది. ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ అవతారం ఎత్తుతుంది. మంచు వారి అమ్మాయి తీరుకు జనాలు షాక్ అవుతున్నారు. విలక్షణ నటుడిగా దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమలో రాణించాడు మోహన్ బాబు. ఆయన వారసులు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మంచు విష్ణును స్టార్ హీరో చేయాలని భారీగా లాంచ్ చేశాడు. రెండో కుమారుడు మంచు మనోజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరిలో ఒక్కరు కూడా సత్తా చాటలేదు.

మీరు కాదు నేనున్నానని మంచు లక్ష్మి రంగంలోకి దిగింది. ఆమె హీరోయిన్ కావాలని అనుకున్నారు. గుండెల్లో గోదారి, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించింది. ఫలితం మాత్రం శూన్యం. మంచు లక్ష్మి నటించిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సెటిల్ కాలేదు. నిర్మాతగా మారి ఆమెనే సొంతగా సినిమాలు తీసుకుంటుంది.

ప్రస్తుతం అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేసింది. షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు. ఆ సినిమా సంగతి అలా పక్కన పెట్టి ఇతర వ్యాపకాల్లో మంచు లక్ష్మి బిజీగా గడుపుతుంది. ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసే ఫోటో షూట్స్ చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు పదుల వయసు దాటినా కూడా తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తుంది. మంచు లక్ష్మి ఫోటో షూట్స్ ని పలువురు ట్రోల్ చేసినా పట్టించుకోవడం లేదు.

తాజాగా నైట్ వేర్ ని తలపించే డ్రెస్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చింది. చిన్న షార్ట్ ధరించి థైస్ షోస్ చేసింది. మంచు లక్ష్మి బోల్డ్ అవతార్ వైరల్ అవుతుంది. మరోవైపు మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. మంచు విష్ణు-మనోజ్ విడిపోయారు. మనోజ్ కి సపోర్ట్ గా మంచు లక్ష్మి నిలిచింది. కుటంబం దూరం పెట్టినా తమ్ముడు పెళ్లి చేసింది. మోహన్ బాబు మాత్రం పెద్ద కొడుకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు. ఆస్తుల పంపకాల విషయంలో తేడాలు వచ్చాయనే వాదన ఉంది.