Manchu Lakshmi : విలక్షణ నటుడు మోహన్ బాబు ఏకైక కుమార్తె మంచు లక్ష్మి ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. అక్కడ టెలివిజన్ హోస్ట్ గా చేసింది. అలాగే ఒకటి రెండు ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది. కారణం తెలియదు కానీ ఇండియాకు తిరిగి వచ్చేసింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలి అనుకుంది. మొదటి తెలుగు చిత్రం అనగనగా ఓ ధీరుడు లో లేడీ విలన్ గా మెప్పించే ప్రయత్నం చేసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్, దొంగాట, లక్ష్మి బాంబ్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. అయితే మంచు లక్ష్మికి బ్రేక్ రాలేదు.
నటిగా, నిర్మాతగా సినిమాలు చేస్తూనే పలు టెలివిజన్ షోలకు హోస్ట్ వ్యవహరించింది. హోస్ట్ గా మంచు లక్ష్మి ఒకింత సక్సెస్ అని చెప్పొచ్చు. సడన్ గా మంచు లక్ష్మి మకాం ముంబై కి మార్చింది. అక్కడ ఓ లగ్జరీ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆమెకు మంచి ఫ్రెండ్. రకుల్ సలహా మేరకే మంచు లక్ష్మి ముంబైలో కెరీర్ మొదలెట్టిందట. మరోవైపు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరాయి. మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ విభేదించాడు. ఆస్తుల తగాదాలు కొనసాగుతున్నాయి. పరస్పర దాడులు, కేసుల వరకు వ్యవహారం వెళ్ళింది.
Also Read : బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో మంచు లక్ష్మి..అడ్డంగా దొరికిపోయిందిగా!
కాగా మనోజ్ చాలా కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. మంచు లక్ష్మి అతడికి మద్దతుగా నిలుస్తుంది. భూమా మౌనికను మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని మోహన్ బాబు వ్యతిరేకించాడు అనే వాదన ఉంది. ఇక మనోజ్-మౌనికల వివాహం మంచు లక్ష్మి తన నివాసంలో చేసింది. మోహన్ బాబు చివరి నిమిషంలో హాజరయ్యాడు. ప్రస్తుతం మోహన్ బాబు-మనోజ్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు.. మోహన్ బాబు, విష్ణు మరొకవైపు చేరి గొడవలు పడుతున్నారని సమాచారం.
2023లో మౌనికను మనోజ్ వివాహం చేసుకోగా వీరికి ఒక అమ్మాయి సంతానం. దేవసేన అని పేరు పెట్టారు. దేవసేన మొదటి బర్త్ డే నేపథ్యంలో మంచు లక్ష్మి ఒక పోస్ట్ పెట్టారు. దేవసేన పుట్టిననాడు మంచు లక్ష్మి హైదరాబాద్ లోనే ఉందట. పేరెంట్స్ కంటే ముందు ఆ పాపను తానే ఎత్తుకుందట. దేవసేన వంటి డైమండ్ ని తనకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు మంచు లక్ష్మి మనోజ్ దంపతులకు కృతఙ్ఞతలు తెలిపింది. అలాగే దేవసేన క్యూట్ నెస్ కి పడిపోయిన మంచు లక్ష్మి.. ఏదో ఒక రోజు ఆమెను కిడ్నాప్ చేసి ముంబైకి తీసుకుపోతుందట. మేనకోడలు మీద ప్రేమను చాటుతూ మంచు లక్ష్మి విడుదల చేసి వీడియో వైరల్ అవుతుంది. ఇక మౌనికకు మొదటి భర్తతో ఒక అబ్బాయి సంతానం. ఆ పిల్లాడిని మనోజ్ దత్తత తీసుకోవడం విశేషం.
Also Read : అందుకే భర్తకు దూరంగా ఉంటున్నా.. ఎట్టకేలకు నోరు విప్పిన మంచు లక్ష్మి!