Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi Hollywood movie: హాలీవుడ్ మూవీ లో మంచు లక్ష్మి.. సంచలనం రేపుతున్న వీడియో..

Manchu Lakshmi Hollywood movie: హాలీవుడ్ మూవీ లో మంచు లక్ష్మి.. సంచలనం రేపుతున్న వీడియో..

Manchu Lakshmi Hollywood movie: సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలలో అత్యధిక మీమ్స్ ని మంచు లక్ష్మి పై , మంచు కుటుంబం పై వస్తాయనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు లక్ష్మి పై వచ్చే ఫన్నీ మీమ్స్ ఎలాంటివో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆమె మాట్లాడే ప్రతీ మాటని మనం వాస్తవ దూరం అనే అనుకుంటూ ఉంటాము, కానీ వాటిల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. అవి చాలా కాలం తర్వాత మనం చూసినప్పుడు , అరెరే మంచు లక్ష్మి నిజమే చెప్పింది , మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం అని అనుకుంటాము , ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో మంచు లక్ష్మి మాట్లాడుతూ , నేను ఒక హాలీవుడ్ చిత్రం లో నటించాను అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో దీనిపై వేరే లెవెల్ లో ట్రోల్స్ పడ్డాయి.

కానీ వాస్తవం ఏమిటంటే ఆమె నిజంగానే ఒక హాలీవుడ్ చిత్రం లో నటించింది. ఆ సినిమా పేరు బాస్మతి బ్లూస్. ఈ చిత్రం లోని ఒక సన్నివేశాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. అందులో మంచు లక్ష్మి అచ్చు గుద్దినట్టు హాలీవుడ్ హీరోయిన్ లాగానే అనిపించింది. ఆమె యాస కూడా ఫక్తు అమెరికన్ ఇంగ్లీష్ యాసలోనే ఉంది. దీనిని చూసిన నెటిజెన్స్ మంచు లక్ష్మి అక్క రేంజ్ ఇదా?, అనవసరంగా ఆమెని అపార్థం చేసుకున్నాము అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఎన్నో సూపర్ హిట్ అమెరికన్ షోస్ లో నటించింది. హాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్నాళ్ళు గడిపిన తర్వాతనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రతీ ఒక్కరు ప్రియాంక చోప్రా ని ఇండియా నుండి హాలీవుడ్ లోకి వెళ్లిన మొట్టమొదటి మహిళగా పిలుస్తుంటారు. కానీ మంచు లక్ష్మి హాలీవుడ్ లో స్థిరపడి ఇండియన్ ఫిలిమ్స్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళగా మనం భావించవచ్చు. ప్రస్తుతం మంచు లక్ష్మి కెరీర్ అంత గొప్పగా లేదనే విషయం అందరికీ తెలిసిందే. మోహన్ బాబు కూతురు కదా అని ఈమె మొదటి సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదు , విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే పోషిస్తూ వచ్చింది. అందులో అత్యధిక శాతం విలన్ క్యారెక్టర్స్ ఉన్నాయి , నిర్మాతగా కూడా అనేక సినిమాల్లో నటించింది కానీ, పెద్దగా సక్సెస్ లను అందుకోలేదు. ఇప్పుడు కూడా ఆమె అడపాదడపా క్యారెక్టర్ రోల్స్ లో కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే మంచి యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న మంచు లక్ష్మి మన టాలీవుడ్ మేకర్స్ సరిగా ఉపయోగించుకోలేదు అని చెప్పొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version