కరోనా వైరస్ పెనుభూతంగా మారి పేద ప్రజల పొట్ట కొడుతోంది. నిరుపేదలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈ కష్ట సమయంలో పలువురు సినీ ప్రముఖులు వారికి అండగా నిలిచి సాయం చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఒకరు. తన పెద్ద కుమారుడు మంచు విష్ణుతో కలిసి చంద్రగిరి నియోజకవర్గంలోని 8 గ్రామాలను దత్తత తీసుకున్నారు. అలా దత్తత తీసుకున్న గ్రామాల్లోని పేద కుటుంబాలకు ఆర్ధిక సాయంతో పాటు ఆహారం కూడా అందిస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ఈ సేవలను కొనసాగించాలని మంచు ఫ్యామిలీ గట్టి నిర్ణయం తీసుకొంది. .
ఆ క్రమం లో చంద్రగిరి ప్రాంతం లోని 8 గ్రామాల ప్రజలకు ప్రతిరోజూ 8 టన్నుల కూరగాయలను మరియు ఆహార పదార్ధాలను సరఫరా చేయడం జరుగుతోంది. అంతేకాదు నిత్యావసరాలతో పాటు పేస్ మాస్క్ లు , శానిటైజర్లను ఆ ఎనిమిది గ్రామాల ప్రజలకు అందిస్తున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ తమ మంచి మనసు తో చంద్రగిరి ప్రాంత ప్రజల మనసు గెలుచు కొంటున్నారు. ఇక కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భయంకరమైన వ్యాధి నివారణకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యలను అందరూ పాటించాలని మోహన్ బాబు కోరారు.