Insulting Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి గొప్ప ఇమేజ్ ని సంపాదించుకున్న నటుడు చిరంజీవి…గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. బాబీ డైరెక్షన్లో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి ఆ తర్వాత మెహర్ రమేష్ తో చేసిన ‘భోళాశంకర్’ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో ఇప్పుడు మరోసారి కమర్షియల్ సక్సెస్ అవసరం ఉన్న నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే సినిమా ని చేస్తున్నాడు. 2026 సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి కొంతవరకు డ్యామేజ్ జరుగుతూనే వస్తోంది… నయనతారకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా చిరంజీవి గారికి ఇవ్వడం లేదంటూ కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి.
ఇక దానికి తోడుగా ఇందులో వెంకటేష్ కూడా నటిస్తూ ఉండడం వల్ల చిరంజీవి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని మరి కొంతమంది చెబుతున్నారు. నిజానికి చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రతి సినిమాలో ఏదో ఒక హీరోని వెంటబెట్టుకొని వస్తున్నాడు తప్ప సోలో హీరోగా మాత్రం రావడం లేదంటూ చాలామంది విమర్శలను గుప్పిస్తున్నారు…
50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందిన ఆయన ఇప్పుడు ఇలాంటి విమర్శలను ఎదురుకోవడాన్ని చూస్తున్న మెగా అభిమానులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురవుతున్నారు… చిరంజీవి సోలో హీరోగా వచ్చి సినిమా చేస్తే బాగుంటుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మన శంకర్ వరప్రసాద్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటానని చిరంజీవి చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు… ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపిస్తాడా? నిజంగా ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…