Mana Shankara Varaprasad Garu Trailer: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రేపు విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి, ఈ మూడు పాటల్లో ‘మీసాల పిల్ల’ పాటకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే వంద మిలియన్ వ్యూస్ బెంచ్ మార్క్ ని దాటింది ఈ చిత్రం. ఈ పాట తర్వాత విడుదలైన ‘శశిరేఖ’, ‘మెగా మాస్ విక్టరీ’ సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి కానీ, మీసాల పిల్ల పాటకు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం ఈ పాటలకు రాలేదు. అయితే అభిమానులు ఎప్పటి నుండో ట్రైలర్, లేదా టీజర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు.
రేపు విడుదల అవ్వబోతున్న సందర్భంగా కాసేపటి క్రితమే ఆ చిత్ర డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రైలర్ కి సంబంధించిన ఒక అప్డేట్ ని ఇచ్చాడు. థియేట్రికల్ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 30 సెకండ్స్ వరకు ఉంటుందని, దీన్ని ఇప్పుడే లాక్ చేశామని, రేపు తిరుపతి లోని SV సినీ ప్లెక్స్ లో జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కలుద్దాం అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. ఆ పోస్ట్ చేసిన ఫొటోలో చిరంజీవి గన్ పట్టుకొని వీరోచితంగా ఫైట్ చేస్తున్న షాట్ ఒకటి ఉంది. దీన్ని బట్టీ చూస్తుంటే ఈ సినిమాలో కేవలం కామెడీ మాత్రమే కాదు, యాక్షన్ కూడా వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లోనే ఉండబోతుంది అనేది అర్థం అవుతోంది. అనిల్ రావిపూడి లో ఉన్న ప్రత్యేకత ఇదే. ఏ హీరో కి తగ్గట్టు, ఆ హీరోకి క్యారెక్టర్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు. వరుసగా కామెడీ మూవీస్ చేస్తూ వచ్చిన అనిల్ రావిపూడి, బాలయ్య తో ‘భగవంత్ కేసరి’ లాంటి యాక్షన్ చిత్రం చేసి హిట్ కొట్టాడు.
ఇక్కడ కూడా అంతే, చిరంజీవి సినిమా అంటే ఆడియన్స్ డ్యాన్స్, ఫైట్స్, కామెడీ అన్నీ ఆశిస్తారు. అవన్నీ పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసి, ఈ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరి ఆ రేంజ్ లో సినిమాని ఆయన నిజంగా తీసి ఉంటే, ఈ చిత్రం సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల విషయం లో వండర్స్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా హిలేరియస్ గా ఉంటాయని అంటున్నారు. ట్రైలర్ లో కూడా వెంకటేష్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని మనం చూడొచ్చు.
Locked…Loaded…Ready to shoot
2 min 30 sec #ManaShankaraVaraPrasadGaru Trailer out tomorrowSee you all at SV CinePlex, Tirupati pic.twitter.com/QbW0ULigGH
— Anil Ravipudi (@AnilRavipudi) January 3, 2026