Meesaala Pilla Full Song: రీసెంట్ సమయం లో ఒక ప్రోమో సాంగ్ సెన్సేషన్ సృష్టించడం ‘మీసాల పిల్ల'(Meesala Pilla) సాంగ్ కే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu) చిత్రంలోని పాట ఇది. నిన్ననే విడుదల కావాల్సి ఉంది, కానీ కొన్ని టెక్నీకల్ కారణాల చేత ఈరోజుటికి వాయిదా పడి, కాసేపటి క్రితమే ఈ పాట ని విడుదల చేశారు. ప్రోమో సాంగ్ విన్నప్పుడే చార్ట్ బస్టర్ అనిపించింది. ఇక నేడు విడుదలైన ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ని చూసిన తర్వాత అభిమానులకు మెంటలెక్కిపొయింది. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి ఎలాంటి కంటెంట్ ని అభిమానులు కోరుకుంటున్నారో, అలాంటి కంటెంట్ ని అందించడం లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మొదటి బాల్ తోనే సిక్సెర్ కొట్టేసాడు అని చెప్పొచ్చు.
భీమ్స్ అందించిన ట్యూన్ చాలా క్యాచీ గా ఉంది, అదే విధంగా చిరంజీవి తో వేయించిన గ్రేస్ ఫుల్ స్టెప్స్ చూసేందుకు చాలా ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ రేంజ్ స్టెప్పులు చిరంజీవి నుండి ఈ సినిమాకే చూస్తున్నాం. ఇక చిరంజీవి లుక్స్ కూడా చాలా ఫ్రెష్ గా నేచురల్ గా అనిపిస్తున్నాయి. నయనతార కూడా చూసేందుకు చాలా బాగా కనిపిస్తుంది. భార్య భర్తపై అలిగినప్పుడు, ఆ భర్త ఆమెని కూల్ చేసే ప్రయత్నం లో చేసే చిలిపి చేష్టలను డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ తో చాలా చక్కగా చూపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇలాంటి పాటలు బాగా నచ్చుతాయి. ఈ ఏడాది ప్రారంభం లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం లోని పాటలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ‘గోదారి గట్టు మీద రామచిలకవే’ అనే పాట ప్రభంజనం సృష్టించింది.
ఈ మీసాల పిల్ల పాట కూడా అదే రేంజ్ లో సూపర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలైనా ఫ్యామిలీ ఆడియన్స్ కి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం మొదటి ఛాయస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 12 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి. ఈ పాటకు ఉదిత్ నారాయణ్ అందించిన గాత్రం బాగా ప్లస్ అయ్యింది. అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ పాట ని మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
