Mouli remuneration hike: ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాల్లో ఒకటి ‘లిటిల్ హార్ట్స్'(Little Hearts). యూట్యూబ్ లో మంచి పాపులారిటీ ని సంపాదించిన మౌళి(Mouli Talks) ఈ సినిమా ద్వారా వెండితెర కి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ఏకంగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని, కొంతమంది మీడియం రేంజ్ స్టార్ హీరోలకు కూడా ఈ ఏడాది సాధ్యపడని అరుదైన రికార్డు ని నెలకొల్పాడు మౌళి. రీసెంట్ గానే ఓటీటీ లో విడుదలైన ఈ చిత్రానికి టీవీ ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో చూడని వాళ్లకు, అయ్యో మంచి సినిమాని థియేటర్స్ లో మిస్ అయ్యామే అనే ఫీలింగ్ ని కలిగించింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా తర్వాత మౌళి రేంజ్ బాగా పెరిగిపోయింది.
రెండవ చిత్రం ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేస్తున్నాడు. యూట్యూబ్ సెలబ్రిటీ స్థాయి నుండి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ తో సంచలనాత్మక చిత్రాలను నిర్మించిన నిర్మాణ సంస్థతో సినిమా చేసే స్థాయికి మౌళి చేరుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఈ సంస్థ నుండి ఆయన అందుకున్న అడ్వాన్స్ ఎంతో తెలుసా?, అక్షరాలా కోటి రూపాయిలు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే, సినిమా చేసి, అది సూపర్ హిట్ అయ్యాక ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ అందే అవకాశాలు ఉన్నాయి. ఇది నిజమైన సక్సెస్ అంటే. ఇలా చాలా మంది టాలెంటెడ్ యూట్యూబర్స్ ఉన్నారు. కానీ మౌళి కి అదృష్టం కూడా కలిసొచ్చింది, వాళ్లకు కలిసి రాలేదు అంతే. అయితే మౌళి కి అంత తేలికగా అవకాశాలు అయితే రాలేదు.
చిన్న తనం నుండి స్టాండప్ కమెడియన్ గా ఎన్నో ఈవెంట్స్ చేసాడు, ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తన టాలెంట్ తో లక్షల మంది దృష్టిలో పడ్డాడు. ఇక ఆ తర్వాత సినీ నిర్మాతలు ఆయన వద్దకు వచ్చారు. ఇక మీదట వస్తూనే ఉంటారు. టాలెంట్ ఉన్నవాళ్లకు అదృష్టం తోడైతే, ఆకాశమే హద్దు అని చెప్పాలి. తమిళనాడు లో ప్రదీప్ రంగనాథన్ ఎలా అయితే లేటెస్ట్ సెన్సేషన్ గా మారాడో, మౌళి కూడా మంచి కథలతో ఆడియన్స్ ముందుకొస్తే ఆయన కూడా ఆ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుంది. చూడాలి మరి సక్సెస్ ని మౌళి ఎలా తనకు మెట్లు గా మార్చుకొని ముందుకు వెళ్తాడు అనేది.