Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 10 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. ఈ పది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 252 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి నాలుగు సినిమాలు పోటీ గా వచ్చాయి, అందులో మూడు సినిమాలకు సూపర్ హిట్ టాక్ వచ్చాయి , ఇప్పటి వరకు ఏ సంక్రాంతికి కూడా ఇలాంటిది జరగలేదు, అయినప్పటికీ కూడా ఈ చిత్రం ఇప్పుడు 300 కోట్ల గ్రాస్ వైపు పరుగులు తీస్తోంది. ఈ సోమవారానికి ఆ మార్కు ని అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఇప్పటికీ బుక్ మై షో లో గంటకు 5 వేల టిక్కెట్ల అమ్మకంతో సంక్రాంతి మూవీస్ టాప్ గా నిల్చింది.
ఈ వారం బుక్ మై షో యాప్ టికెట్ సేల్స్ గణాంకాల విషయానికి వస్తే, సోమవారం రోజున లక్షకు పైగా టికెట్స్ ఈ చిత్రానికి అమ్ముడుపోగా, మనగలవారం రోజున 68 వేల టిక్కెట్లు, బుధవారం రోజున 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మొదటి వారం ఆ రేంజ్ లో జనాలు చూసిన తర్వాత కూడా రెండవ వారం వర్కింగ్ డేస్ లో ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అలా కేవలం ఈ మూడు రోజుల్లోనే బుక్ మై షో యాప్ ద్వారా రెండు లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లోనూ ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ డిస్ట్రిక్ట్ యాప్ లో జరిగే విషయం మన అందరికీ తెలిసిందే. అక్కడ బుక్ మై షో యాప్ కంటే భారీగా టికెట్ సేల్స్ జరిగాయి. ఓవరాల్ గా పడి రోజుల్లో బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి ఈ చిత్రానికి 52 లక్షల టికెట్స్ అమ్ముడుపోయాయని టాక్.
ఇంకో వారం రోజులు డీసెంట్ రన్ ని ఈ చిత్రం సొంతం చేసుకుంటే కచ్చితంగా కోటి టికెట్స్ అమ్ముడుపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కేవలం బుక్ మై షో యాప్ లోనే ఈ చిత్రం ఈ వీకెండ్ తో 4 మిలియన్ల మార్కుని అందుకోనుంది. అంటే ఎన్టీఆర్ దేవర తెలుగు + హిందీ వెర్షన్ క్లోజింగ్ టికెట్ సేల్స్ ని ఈ చిత్రం దాటేయబోతుంది అట. సింగిల్ వెర్షన్ మీద ఇంతటి పోటీ వాతావరణం లో ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ కుమ్ముడు కేవలం మెగాస్టార్ కి మాత్రమే సాధ్యం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.