One Plus 16: మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మొబైల్స్ కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. దీంతో కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేట్ చేసిన ఫోన్లను మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువగా One Plus మొబైల్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ కంపెనీకి చెందిన 16 మొబైల్ అప్డేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఆన్లైన్లో ఉంచారు. దీన్ని బట్టి చూస్తే మొబైల్ లో భారీ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ అప్డేట్ అయినా ఈ మొబైల్ ఎలా ఉండబోతుందంటే?
Oneplus 16 కొత్తగా వచ్చే మొబైల్ లో కెమెరా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండే విధంగా సెట్ చేశారు. ఇది పెరిస్కోప్ స్టైల్ తో పాటు టెలిఫోటో నువ్వు అందిస్తుంది. ఈ కెమెరా సెన్సార్ విషయంలో లేటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉండబోతుంది. స్నాప్ తీసేటప్పుడు జూమ్ చేసినా కూడా ఎలాంటి క్వాలిటీ తగ్గకుండా ఫోటో తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 50 MP సెన్సార్లతో కూడిన కెమెరా ఉండబోతుంది. సెల్ఫీల కోసం కూడా ఇదే మెగాపిక్సల్ తో ఫోటోలు తీసుకోవచ్చు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ తో పాటు.. మల్టీ టాస్కింగ్ యూస్ చేసే వారికి ఈ కెమెరా అద్భుతమైన ఫోటోలను అందించే అవకాశం ఉంది.
ఇందులో ఆకట్టుకునే డిస్ప్లే ఉండనుంది. కొత్తగా రాబోతున్న ఈ మొబైల్ లో 200 Hz రిఫ్రెష్ రేట్ తో డిస్ప్లే ఉండనుంది. అత్యంత వేగవంతమైన స్మూత్ స్క్రోలింగ్ ఉండడంతోపాటు ఆకర్షణీయమైన డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు వచ్చిన మొబైల్స్ లో ఉండే రిఫ్రెష్ రేట్ కంటే ఇందులో అత్యధిక ఉండడంతో ఇదే మొదటి మొబైల్ అని అంటున్నారు. ఈ మొబైల్ లో బలమైన బ్యాటరీని అమర్చారు. ఇందులో 9000 mAh గ్లాసియర్ బ్యాటరీని చేర్చారు. ఇప్పటి వరకు వచ్చిన మొబైల్స్ లో కంటే ఈ మొబైల్లో ఉండే బ్యాటరీ అతిపెద్దది అని అంటున్నారు. దీంతో రోజంతా వినియోగించినా కూడా చార్జింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే డౌన్ టైం కూడా తక్కువగా ఉండడంతో మొబైల్ పై ఎక్కువగా ఆధారపడే వారికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఇక ఇందులో 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్ ఉండడంతో వేగంగా మూవ్ కావడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఇందులో లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ తో పాటు.. లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఫీచర్లు ఇందులో అమర్చనున్నారు. త్వరలో దీనిపై ధర క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.