Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓటీటీ లోకి కూడా ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చి వారం రోజులు దాటింది. అయినప్పటికీ కొన్ని సెంటర్స్ లో రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలకంటే ఈ చిత్రానికే ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. చాలా రోజుల తర్వాత మన తెలుగు సినిమా అత్యధిక సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇది సాధారణమైన విషయం కాదు. అయితే కేవలం కొన్ని ప్రాంతాలు మినహా, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం కలెక్షన్స్ క్లోజ్ అయిపోవడం తో, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా క్లోజింగ్ లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి 47.43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 50 కోట్ల బెంచ్ మార్క్ ని అందుకుంటుందని అంతా ఆశించారు కానీ, తృటిలో తప్పింది. అదే విధంగా సీడెడ్ ప్రాంతం లో 23.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు,పశ్చిమ గోదావరి జిల్లా నుండి 10.24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, గుంటూరు జిల్లా నుండి 11.40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, కృష్ణా జిల్లా నుండి 11.15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, నెల్లూరు జిల్లా నుండి 7.02 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 232 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 13.80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఓవర్సీస్ నుండి 19.60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 183 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 304 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి ఓవరాల్ గా లాభాలు 61 కోట్ల రూపాయిల వరకు వచ్చింది. కానీ USA లో మాత్రం ఆశించిన రేంజ్ లో లాభాలు రాలేదని అంటున్నారు. ఎందుకంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రానికి సరైన విడుదల ఇవ్వలేదు. ఆయన వరకు సేఫ్ అయ్యి లాభాల్లోకి వెళ్ళాడు కానీ, అక్కడి లోకల్ బయ్యర్స్ కి మాత్రం నష్టాలు వచ్చాయట.