Mana Shankara Varaprasad Garu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలై ఎలాంటి కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాములుగా ఉంటుందా?, మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు పాతిక కోట్ల రూపాయిల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా రెండు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ఇంత పెద్ద విజయం సాధించింది కాబట్టి నిన్న ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్.
ఈ సక్సెస్ మీట్ లో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అదేమిటంటే ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి కొడుకు గా, ఎంతో క్యూట్ గా కనిపించిన విక్కీ అబ్బాయి కాదంట, అమ్మాయి అట. ఆమె పేరు ఊహ అని ఈ ఈవెంట్ ద్వారా తెలియజేసారు మేకర్స్. సినిమాలో ఈ చిన్నారి అచ్చు గుద్దినట్టు అబ్బాయి లాగానే కనిపించాడు. ఎక్కడ కూడా అమ్మాయి మ్యానరిజమ్స్ , బాడీ లాంగ్వేజ్ ని రానివ్వకుండా చాలా చక్కగా మ్యానేజ్ చేసాడు. ఈమె గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ముందు ఆ అమ్మాయికి అందరూ చప్పట్లు కొట్టాలి. అమ్మాయిలకు జుట్టు ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలాంటిది అబ్బాయి పాత్ర కోసం ఈ చిన్నారి జుట్టు మొత్తం కత్తిరించుకుంది’ అని అంటాడు. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత సినిమా ఛాయలు మనకు గుర్తుకు వచ్చాయి కదా, అలా అప్పట్లో చిరంజీవి గారి ‘పసివాడి ప్రాణం’ చిత్రం లో బేబీ సుజిత చిరంజీవి కొడుకు పాత్రలో కనిపించిందని, ఇప్పుడు ఈ బేబీ ఊహా చిరంజీవి గారి కొడుకు గా నటించిందని, ఈ రెండు సిమిలారిటీస్ ప్లాన్ చేసుకున్నది కాదని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.
ఈ పాప ఎంత క్యూట్ గా మాట్లాడిందో ఈ క్రింది వీడియో లో చూడండి. చిన్న వయస్సులో ఇంత చక్కగా మాట్లాడిన ఈ అమ్మాయి ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మురిసిపోతున్నారు. ఈ చిత్రం లోనే కాదు, ఈమె షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించిన గత రెండు చిత్రాల్లో కూడా బాల నటిగా నటించిందట. అంటే ‘భగవంత్ కేసరి’ చిత్రం లో చిన్ననాటి శ్రీలీల పాత్రని పోషించింది ఈమెనే. అదే విధంగా విశ్వక్ సేన్ ‘లైలా’ చిత్రం లో కూడా నటించింది.
Cute Twist:
This little girl, Ooha, played the role of Vicky, #Chiranjeevi’s son in #ManaShankaraVaraPrasadGaru. pic.twitter.com/54ScOWvuRX
— Gulte (@GulteOfficial) January 13, 2026