Mana Shankara Varaprasad Garu Collection: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) జోరు బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం కూడా తగ్గలేదు. జనవరి 12 న బ్యాటింగ్ మొదలు పెడితే, ఇప్పటికీ గ్రౌండ్ లో వీరంగం ఆడుతూనే ఉన్నాడు మెగాస్టార్. రెండవ వారం లో రెండు పెద్ద హాలిడేస్ వచ్చాయి, ఇక కలెక్షన్స్ బాగా తగ్గిపోతాయి, 300 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా లేదు. 16 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 11 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇలాంటి స్టడీ థియేట్రికల్ రన్ ఈమధ్య కాలం లో ఏ స్టార్ హీరో సినిమాకు కూడా రాలేదు. చిరంజీవి సినిమాకు టాక్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా థియేటర్స్ కి జాతర లాగా కదులుతారో చెప్పడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ.
16 రోజులు పూర్తి అయ్యింది. ఈ 16 రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా ఇప్పుడు మనం చూడబోతున్నాము. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి రిటర్న్ జీఎస్టీ తో కలిపి 44.38 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు విడుదలైన ప్రాంతీయ బాషా చిత్రాల్లో ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి అక్షరాలా 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఈ వీకెండ్ కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉండడం తో ఫుల్ రన్ లో కచ్చితంగా 24 నుండి 25 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు ఈ ప్రాంతం నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 21.46 కోట్లు, తూర్పు గోదావరి నుండి 15.15 కోట్ల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 9.56 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా గుంటూరు జిల్లా నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, కృష్ణా జిల్లా నుండి 10.67 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక నెల్లూరు జిల్లా లో అయితే ఈ చిత్రం ఏకంగా 6.5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 214 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. దీంతో ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 172 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 282 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.