Mana Shankara Vara Prasad Garu: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సీనియర్ హీరోల హవా మాత్రం తగ్గడం లేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్లు వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో కొత్త జోష్ నింపుతున్నారు.స్టార్ హీరోలెవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా వాళ్ళందరిని పట్టించుకోకుండా తన సినిమాలను తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవి వైఫ్ గా నయనతార నటిస్తుంది. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో వెంకటేష్ నటిస్తున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే వెంకటేష్ నటించిన క్యారెక్టర్ ఏంటి అంటే నయనతార బాయ్ ఫ్రెండ్ గా వెంకటేష్ కనిపిస్తాడట. చిరంజీవి నయనతార పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత నయనతార వెంకటేష్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది.
ఈ ప్రాసెస్ లో వెంకటేష్ తనతో ఉంటూనే భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారట. దాంతో నయనతార మారిపోయి చిరంజీవి దగ్గరికి వచ్చేస్తుందట. మొత్తానికైతే చిరంజీవి వైఫ్ గా ఉన్న నయనతారను వెంకటేష్ ప్రేయసి రాలిగా చూపించడాన్ని ప్రేక్షకులు ఎంతవరకు ఒప్పుకుంటారు.
ఈ విషయంలో ఏమాత్రం తేడా జరిగిన కూడా అనిల్ రావిపూడి ని విపరీతంగా విమర్శించే అవకాశాలైతే ఉన్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు… నిజానికి అనిల్ రావిపూడి కి పెళ్లయిన తర్వాత ప్రేయసి ఇంటికి రావడం, లేదంటే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం.
ఇదంతా జరిగిన తర్వాత మళ్లీ ఆ అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ కనిపించడం లాంటి కథలతోనే సినిమాలు చేస్తాడా? సొసైటీలో ఎన్నో కథలు ఉన్నప్పటికి ఆయన వీటిమీదనే ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు. అతని పని అయిపోయిందా? ఇక అంతకుమించి అతని నుంచి మనం మంచి కథలను ఎక్స్పెక్ట్ చేయడం మన మూర్ఖత్వమే అవుతుందా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు..