Mammootty vs Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటి అంటే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది. ఏ భాషలో ఉన్న ప్రేక్షకుడైన సరే ఇండియాలో వచ్చిన ప్రతి సినిమాని ఓడిటి ప్లాట్ఫామ్ ద్వారా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా అనేది ఒక భాషకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఇండియా వైడ్ గా ఒక సినిమాని అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అందువల్లే ఇప్పుడు చాలా సినిమాలు తెలుగులో అనువాదమై ఇక్కడ కూడా మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మమ్ముట్టి (Mammutty) చాలా సంవత్సరాల నుంచి అక్కడ మెగాస్టార్ గా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్నీ సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకు ఆయన 400 సినిమాలను చేశాడు. ఇక తన కొడుకు అయిన దుల్కర్ సల్మాన్ (Dulkar Salman) సైతం ఇండస్ట్రీ కి వచ్చి మహా అయితే 10 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఆయన ఇప్పటికే 40 సినిమాలకు చేశాడు.
Also Read : రామ్ పోతినేని,సాయి ధరమ్ తేజ్, నితిన్ లు నటనలో ఆ స్టార్ హీరోను కాపీ చేస్తున్నారా..?
వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు సంవత్సరంలో రెండు నుంచి మూడు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఆయన సినిమాల సంఖ్య అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే అతనికి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి…
ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన కొడుకు అయినా రామ్ చరణ్ (Ram Charan) సైతం స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అలాగే గ్లోబల్ స్టార్ గా అవతరించాడు… మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ లలో ఉన్న ఒక్క క్వాలిటీ చిరంజీవి రామ్ చరణ్ లో లేదు అంటూ చాలా మంది విమర్శకులు విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ క్వాలిటీ ఏంటి అంటే మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ చాలా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ ఉంటారు.
మమ్ముట్టి అయితే ఒక సంవత్సరంలో 6 నుంచి ఏడు సినిమాల వరకు రిలీజ్ చేస్తూ ఉంటాడు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ లు మాత్రం రెండు సంవత్సరాలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అందువల్లే ఆ తండ్రి కొడుకులతో పోలిస్తే మన చిరంజీవి రామ్ చరణ్ లు కొంతవరకు వెనుకబడిపోయారని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
Also Read : హజ్ తీర్థయాత్ర ఆధ్యాత్మిక రహస్యం ఏంటి? ముస్లింలు అహ్మదు లిల్లాహ్ ఎందుకు అంటారు?