https://oktelugu.com/

Prabhas-Hanu Raghavapudi: ‘హను రాఘవపూడి – ప్రభాస్’ సినిమాలో కీలకపాత్ర లో కనిపించనున్న మెగాస్టార్…

గత సంవత్సరం సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి, రాజాసాబ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : April 15, 2024 / 01:46 PM IST

    Mammootty play a key role in Hanu Raghavapudi - Prabhas Movie

    Follow us on

    Prabhas-Hanu Raghavapudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుంచి పాన్ ఇండియాలో తన స్థాయిని చూపిస్తు ప్రభాస్ ముందుకు వెళ్తున్నాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు కూడా ఆయనకు తిరుగులేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆయన ఇండియా అనే కాకుండా ప్రపంచం లోని చాలా లాంగ్వేజ్ ల్లో ఆయన సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అంటే ఎవరో చాలామంది జనాలకి తెలుసు.

    ఆయన సినిమాల కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంటే ఆయన సాధించిన ఘనత ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గత సంవత్సరం సలార్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఈ సంవత్సరం కల్కి, రాజాసాబ్ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే హను రాఘవపూడి డైరెక్షన్ లో మరొక సినిమాకి కమిట్ అయిన ప్రభాస్ ఈ సినిమాని తొందరలోనే సెట్స్ మీద కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్ లో మలయాళ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు పొందిన మమ్ముట్టి ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఈ క్యారెక్టర్ లో ఆయన్ని ఎందుకు తీసుకున్నారు అంటే, ఆ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ అంట. ఆ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. అందువల్లే డైరెక్టర్ మమ్ముట్టి అయితేనే దానికి బాగా సెట్ అవుతాడనే ఉద్దేశ్యంతో మమ్ముట్టి ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక వైవిధ్యమైన పాత్రలను చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు ఉంటాడు. కాబట్టి ఈ సినిమాలోని పాత్రకి కూడా తననే తీసుకోబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లాలంటే మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. కాబట్టి ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని హను రాఘవపూడి పూర్తి చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీని కంటే ముందు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ చేయాల్సిన ‘స్పిరిట్ ‘ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళి అది ఫినిష్ అయిన తర్వాత ఈ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి…