Mammootty Rejected Pawan Kalyan Movie: పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్.. అల్లు అరవింద్‌కు గట్టి షాక్ ఇచ్చిన మమ్ముట్టి..!

Mammootty Rejected Pawan Kalyan Movie: సినీ ఇండస్ట్రీలో అంతా ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుంటుంది. ఒక ఇండస్ట్రీలో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిన వారు వేరే భాషల్లో విలన్ రోల్స్, తండ్రి, బాబాయ్ వంటి పాత్రలను పోషిస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడం వంటి చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఇప్పటికే ఇలాంటి పాత్రలు చాలానే పోషించారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ను అందుకుంటున్నాయి. అందుకే అన్ని ఇండస్ట్రీలకు చెందిన మంచి గుర్తింపు […]

Written By: Mallesh, Updated On : January 4, 2022 1:11 pm
Follow us on

Mammootty Rejected Pawan Kalyan Movie: సినీ ఇండస్ట్రీలో అంతా ఫ్రెండ్లీ నేచర్ కనిపిస్తుంటుంది. ఒక ఇండస్ట్రీలో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిన వారు వేరే భాషల్లో విలన్ రోల్స్, తండ్రి, బాబాయ్ వంటి పాత్రలను పోషిస్తుంటారు. తెలుగు, తమిళ, కన్నడం వంటి చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఇప్పటికే ఇలాంటి పాత్రలు చాలానే పోషించారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌ను అందుకుంటున్నాయి. అందుకే అన్ని ఇండస్ట్రీలకు చెందిన మంచి గుర్తింపు పొందిన నటీనటులను తెలుగు సినిమాల్లోకి ఆహ్వానిస్తున్నారు మన దర్శకులు. తాజాగా మళయాలం యాక్టర్ ఫహద్ ఫాసిల్ పుష్ప సినిమాలో నెగెటివ్ రోల్ చేసిన విషయం తెలిసిందే.

Mammootty Rejected Pawan Kalyan Movie

అయితే, గతంలోనూ తమిళం, మళయాలం ఇండస్ట్రీలకు చెందిన నటులు తెలుగు చిత్రాల్లో మెరిసారు. టాలీవుడ్‌లో ముఖ్యంగా తండ్రి, తల్లి పాత్రలు పోషించే వారిలో తమిళ ఇండస్ట్రీకి చెందిన నటీనటులే అధికంగా కనిపిస్తుంటారు. అయితే, గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలో విలన్ రోల్ కోసం నిర్మాత అల్లు అరవింద్ ఏకంగా మళయాలం సూపర్ స్టార్ అయిన మమ్ముట్టికి కాల్ చేశారట..

Also Read: ఫస్ట్ టైమ్ ఆ ఫోటోని షేర్ చేసిన కాజల్ అగర్వాల్… అభిమానులు ఫిదా ?

ఆయన ఇచ్చిన కౌంటర్‌కు వెంటనే సారీ చెప్పి ఫోన్ పెట్టేశారట.. ఈ విషయాన్ని ఓ సినిమా ఫంక్షన్‌లో స్వయాన అల్లు అర్వింద్ చెప్పుకొచ్చారు. పక్కనే హీరో మమ్ముట్టి కూడా ఉన్నారు. అల్లు అరవింద్ మాటలు విని ఆయన కూడా నవ్వుకున్నారు.

వీరిద్దరి మధ్య అంతలా ఏం సంభాషణ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘జల్సా’ మూవీలో విలన్ కోసం అల్లు అరవింద్ మమ్ముట్టికి కాల్ చేసి మీ కోసం మంచి పాత్ర ఉందని తెలిపారట.. ఏంటది అని అడుగగా విలన్ రోల్ అని చెప్పారట అల్లు అరవింద్.. అప్పుడు ఇదే విషయం మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని అడుగగలరా? అని అనడంతో అల్లు అరవింద్ మారు మాట్లాలకుండా సారీ చెప్పి ఫోన్ పెట్టేశారట.. ఇలా మమ్ముట్టి అరవింద్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని నిర్మాత అరవింద్ గుర్తుచేసుకున్నారు.

Also Read: ప్రేక్షకుల్ని అయోమయంలో పడేసిన రాధే శ్యామ్ డైరెక్టర్ ట్వీట్… సినిమా వాయిదా గురించేనా ?

Tags