https://oktelugu.com/

Malli Pelli Collections: ‘మళ్ళీ పెళ్లి’ 3 రోజుల వసూళ్లు..16 కోట్లు పెట్టి తీస్తే వచ్చిన చిల్లర ఇదే!

ఆడియన్స్ లో అసలు ఇతను ఎందుకు రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలి కుతుహులం ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కారణం చేత ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 29, 2023 / 08:40 AM IST

    Malli Pelli Collections

    Follow us on

    Malli Pelli Collections: ‘ సోషల్ మీడియా లో వచ్చే నెగటివ్ పబ్లిసిటీ ని క్యాష్ చేసుకోవడం ఇది వరకు మనం టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర చూసాము. సీనియర్ నటుడు నరేష్ ఆయన వీరాభిమాని అనుకుంట, అందుకే ఆయనని తూచా తప్పకుండ ఫాలో అవుతూ తనపై సోషల్ మీడియా లో జరుగుతున్న నెగటివ్ ప్రచారాన్ని క్యాష్ చేసుకునేందుకు పవిత్ర లోకేష్ తో ఆయన నడిపిన లవ్ స్టోరీ ని ఆధారంగా తీసుకొని ‘మళ్ళీ పెళ్లి’ అనే చిత్రాన్ని తీసి రీసెంట్ గానే జనాల మీదకి వదిలాడు.

    ఆడియన్స్ లో అసలు ఇతను ఎందుకు రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అనే విషయం తెలుసుకోవాలి కుతుహులం ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కారణం చేత ఓపెనింగ్స్ అయితే పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి. కానీ నెగటివ్ పబ్లిసిటీ ద్వారా కేవలం అలాంటి ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి, ఫుల్ రన్ రాదు అని మరోసారి ఈ చిత్రం ద్వారా రుజువు అయ్యింది.

    నరేష్ నాల్గవ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసినప్పటి నుండి ఆడియన్స్ ఆయనని అసహ్యించుకోవడం ప్రారంభించారు. నిన్నమొన్నటి వరకు ఒక రేంజ్ డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టు గా ఇండస్ట్రీ లో కొనసాగిన నరేష్ కి, ఇప్పుడు అవకాశాలు ఇవ్వడానికే భయపడుతున్నారు దర్శక నిర్మాతలు. ఆ రేంజ్ లో ఆయనపై నెగటివిటీ ఏర్పడింది, ఆ కారణం చేత సినిమా బాగుంది అని రివ్యూస్ వచ్చినప్పటికీ రెండవ రోజు నుండి చిల్లరి రాలింది.

    మొదటి రోజు 40 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజు 15 లక్షలు, అలాగే మూడవ రోజు 12 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. అలా మూడు రోజులకు కలిపి 67 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది ఈ చిత్రం. ప్రొమోషన్స్ లో నేను ఈ చిత్రానికి 16 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టాను అంటూ నరేష్ చేసుకున్న ప్రచారం వృధా అయ్యింది.
    Recommended Video: