https://oktelugu.com/

Mammootty: గే పాత్రలో నటిస్తున్న సూపర్ స్టార్.. అంతా షాక్

మమ్ముట్టి తాజాగా నటించిన చిత్రం కాదల్ ది కోర్. ఇప్పటికే ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ప్రధాన కారణంగా ఈ సినిమాలో మమ్ముట్టి ‘గే’ పాత్రను పోషించడమే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 11, 2023 / 03:39 PM IST

    Mammootty

    Follow us on

    Mammootty: మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి.. గత నాలుగు దశాబ్దాల కాలంగా ఫేస్ ఆఫ్ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీగా ఉన్న మమ్ముట్టి ఇతర భాషల్లోనూ నటించారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దివంగత నేత వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’తో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు.

    మమ్ముట్టి తాజాగా నటించిన చిత్రం కాదల్ ది కోర్. ఇప్పటికే ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ప్రధాన కారణంగా ఈ సినిమాలో మమ్ముట్టి ‘గే’ పాత్రను పోషించడమే. దీంతో ఆయన అభిమానులతో పాటు విమర్శకులు సైతం ఈ చిత్రంపై చర్చిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా టీజర్ విడుదలకు ముందే కువైట్, ఖతార్ దేశాల నుంచి వ్యతిరేకత కూడా వచ్చిందని తెలుస్తోంది.

    ఎన్నో సంవత్సరాలుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడంతో పాటు మూడు జాతీయ స్థాయి సినిమా అవార్డులను గెలుచుకున్న హీరో మమ్ముట్టి.. ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్న ఓ స్టార్ హీరో ఇటువంటి తరహా పాత్రలను చేయడం విశేషం. అలాగే జియో బేబీ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో జ్యోతిక ప్రధాన పాత్రలో కనిపిస్తారు. నిర్మాతగా మమ్ముట్టి వ్యవహారించిన కాదల్ ది కోర్ సినిమాకు రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయని సమాచారం.

    స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వ్యక్తికి భార్య విడాకులకు అప్లయ్ చేయడంతో పరిస్థితులు మారిపోతాయి. తన భర్త గే అనే కారణాన్ని చెబుతూ ఆమె విడాకులు కోరుతుంది. ఈ పరిస్థితులు కుటుంబంలో, సమాజంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనే అంశంతో సినిమా రూపొందింది. అటువంటి పాత్రలో నటించి మమ్ముట్టి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు.

    మరోవైపు సినిమాపై విమర్శలు సైతం ఎక్కువగా వస్తున్నాయని తెలుస్తోంది. స్వలింగ సంపర్కం గురించి సినిమాలో చూపించడం వలన యువతను తప్పుదారి పట్టించడం అవుతుందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మూవీని వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పెళ్లి అయిన ఓ స్వలింగ సంపర్కుడి అనుభవాలను ఇందులో చూపించడాన్ని కొందరు ఆదరిస్తున్నారు.