Malayalam Actress Allegations: సినీ ఇండస్ట్రీ లో ఆడవాళ్లపై జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు, ప్రతీ ఇండస్ట్రీ లో ఉన్న సమస్యనే. కొంత మంది హీరోయిన్లు బహిరంగంగానే ఈ వ్యవహారం పై నోరు విప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న వాళ్ళు కూడా ఈ సమస్యని ఎదురుకున్న వాళ్ళే. కొంతమంది హీరోయిన్లు సినిమా మీద పిచ్చి తో అన్నిటికి తల వంచి ముందుకు పోగా, మరికొంత మంది మాత్రం ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టుకోలేక సినీ ఇండస్ట్రీ ని వదిలి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే రీసెంట్ గా ఒక యంగ్ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి క్యాస్టింగ్ కౌచ్ సమస్య పై మాట్లాడిన కొన్ని మాటలు ఇండస్ట్రీ లో పెను దుమారం రేపుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే జర్నలిస్ట్ గా, ఆ తర్వాత నటిగా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రినీ ఆన్ జార్జ్ మీడియా తో మాట్లాడుతూ ఒక ప్రముఖ పార్టీ కి చెందిన యువ నేత తనని హోటల్ రూమ్ కి రమ్మన్నాడని, ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకత్వానికి తెలియచేసినా ఎలాంటి చర్యలు అతని పై తీసుకోలేదని , అంతే కాకుండా ఆ యువనేతకు అత్యున్నత పదవులు ఇచ్చి ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లారని ఈ సందర్భంగా రినీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ఒక్క మహిళా ఆత్మా గౌరవాన్ని కాపాడలేని ఆ రాజకీయ పార్టీ, రాష్ట్రంలో ఉండే మహిళలను ఎలా కాపాడుతుంది?, కేవలం నా ఒక్క విషయం లోనే కాదు, ఎంతో మంది మహిళల పట్ల ఇండస్ట్రీ లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, ఈరోజు నేను మాట్లాడకపోతే వాళ్ళు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు అని చెప్పుకొచ్చింది.
Also Read: సినిమా బడ్జెట్ ను తగ్గించాలంటే హీరోలు ఈ ఒక్క పని చేయాల్సిందేనా..?
అయితే రినీ బహిరంగంగా ఆ యువ నేత పేరు బయటకు చెప్పకపోయినా, అతను కాంగ్రెస్ పార్టీ కి చెందిన రాహుల్ మంఖాతాటిల్ అని బీజేపీ పార్టీ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈయన ప్రస్తుతం శాసనసభ్యుడిగా, కాంగ్రెస్ యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అయితే బీజేపీ కార్యకర్తలు ఇతను ఉంటున్న పార్టీ కార్యాలయానికి వచ్చి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. గతం లో రాహుల్ ఇలాంటివి చాలానే చేసాడట. ఆ అనుభవాన్ని స్వయంగా సినీ రచయితా హానీ భాస్కరన్ కూడా ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. మరి ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.