Sukumar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ (Sukumar) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా (Pan India) డైరెక్టర్ గా ఎదిగినా కూడా ఆయన చేసిన మొదటి సినిమా నుంచి ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా వరకు మంచి సినిమాలు చేస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించుకున్నాడు. ఇక అదే విధంగా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఒక వర్గం ప్రేక్షకులు ఆ సినిమా కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలో వచ్చే సీన్లలో అంతర్లీనంగా ఒక స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇన్ డెప్త్ డీటెయిలింగ్ రాస్తూ ఉంటారు. దానివల్ల సినిమా చూసే సగటు ప్రేక్షకులు ఆ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేయడమే కాకుండా సినిమాను చూసిన తర్వాత కూడా అందులోని డీటెయిలింగ్ ను కనుక్కోవడానికి మరోసారి ఆయన సినిమాలను చూస్తుంటారు. అలాంటి గొప్ప సినిమాలు చేసే కేపబులిటీ ఉన్న సుకుమార్ ను మించిన దర్శకుడు మరొకరు లేరనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ మనం చేసే సినిమాలు ఎంటర్ టైనింగ్ కోసం చేస్తున్నాం. కాబట్టి ఒక ప్రేక్షకుడిని మనం మూడు గంటలపాటు ఎంగేజ్ చేస్తూ థియేటర్ లో కూర్చోబెడితే బయట క్రైమ్ రేట్ కొద్ది వరకు తగ్గుతుంది అంటూ కొన్ని కామెంట్లైతే చేశాడు. మరి ఆయన సినిమాను ఉద్దేశించి మాట్లాడినప్పటికి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల జనాల నుంచి కొంతవరకు కొన్ని నెగెటివ్ కామెంట్స్ అయితే వెలువడుతున్నాయి.
అవి ఏంటి అంటే నువ్వు తీసిన పుష్ప 2 సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చూపించి ప్రేక్షకుడిని ఎంగేజ్ చేశావ్…ఈ సమయం లో మూడు గంటలు బయట క్రైమ్ తగ్గడం విషయం పక్కన పెడితే నువ్వే క్రైమ్ ఎలా చేయాలో జనాలకు నేర్పిస్తున్నావు అంటూ ఆయన మీద నెగెటివ్ కామెంట్లైతే చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి సుకుమార్ సినిమాల గురించి చెబితే అది జనాలు ఇంకో రకంగా కన్వే చేసుకుంటున్నారు అంటూ మరికొంతమంది సుకుమార్ కి సపోర్టుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఒక బెంచ్ మార్కు క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
ఇక పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్ ఈరోజు రిలీజ్ అయిన నేపధ్యంలో ఇప్పటికే సినిమాని చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక అదనంగా ఈ సినిమాలో ఇంకో 20 నిమిషాల నిడివి ఆడ్ చేయడం వల్ల సినిమా డ్యూరేషన్ మూడు గంటల 40 నిమిషాలకు పెరిగిపోయిందనే చెప్పాలి…