Bigg Boss 8 Telugu
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అఫీషియల్ లోగో కూడా రిలీజ్ చేశారు. హోస్ట్ నాగార్జున తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బిగ్ బాస్ 8 లోగోతో కూడిన ప్రోమో షేర్ చేశారు. బిగ్ బాస్ తెలుగు 8 లోగో టీజర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. దాంతో ఆడియన్స్ లో సందడి మొదలైంది. బిగ్ బాస్ 8 లోగో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. పైగా ఈసారి ఎంటర్టైన్మెంట్ వేరే లెవల్ లో ఉంటుందని లోగో చూసి అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో మరో ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. అదేంటంటే .. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు హౌస్ లు ఉండబోతున్నాయట. ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ ని రెండు టీములుగా విభజించనున్నారట. కొంతమందిని ఒక హౌస్ లో మిగిలిన వారిని మరో ఇంట్లో ఉంచుతారట. ఇక ఇరు ఇళ్లలోని కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు నిర్వహిస్తూ ఆటను రసవత్తరంగా సాగే విధంగా ప్లాన్ రెడీ చేశారట మేకర్స్.
పైగా పక్కింట్లో ఉన్న తమ స్నేహితులను టాస్కుల్లో గెలిచి ఇవతలి టీం సభ్యులు స్వాప్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందట.ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండు హౌస్ లకు సంబంధించిన సెట్ వర్క్ కూడా జరుగుతుందట. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుంది అని సమాచారం. ఎనిమిదవ సీజన్ కి కూడా హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
ఇక బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కంటెస్టెంట్స్ లిస్ట్ పరిశీలిస్తే .. కుషిత కల్లపు, సురేఖ వాణి కూతురు సుప్రీత, మోడల్ ఊర్మిళ చౌహాన్, శీతల్ గౌతమ్, యాదమరాజు, నటి సోనియా సింగ్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటి అక్షిత, రీతూ చౌదరి, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, మై విలేజ్ షో అనిల్, శ్వేతా నాయుడు వంటి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు విష్ణు ప్రియ, వేణు స్వామి, బర్రెలక్క కూడా హౌస్లోకి రావచ్చని అంటున్నారు.
ఒకప్పటి లవర్ బాయ్ అబ్బాస్, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు , సీనియర్ హీరో వినోద్ కుమార్, సొంతం మూవీ ఫేమ్ రోహిత్ తో పాటు మరికొందరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే సూచనలు కలవు. బిగ్ బాస్ లవర్స్ షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 8న లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని విశ్వసనీయ సమాచారం.
ఇక హోస్ట్ నాగార్జున ఈ సీజన్ కి భారీగా వసూలు చేస్తున్నారట. సీజన్ 8కి మొత్తంగా నాగార్జున రెమ్యునరేషన్ రూ. 25 కోట్లు అట. ప్రస్తుతం నాగార్జున ఒక్కో సినిమాకు తీసుకుంటున్న దాని కంటే ఇది చాలా అధికం అని చెప్పొచ్చు. అలాగే అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ హౌస్ సెట్ వేస్తారు. రెంట్ రూపంలో మరికొంత ఆయనకు దక్కుతుంది.
Also Read: ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?