Homeఎంటర్టైన్మెంట్Major Movie Release Date: మే 27న మహేష్ బాబు 'మేజర్'.. ప్రకటించిన...

Major Movie Release Date: మే 27న మహేష్ బాబు ‘మేజర్’.. ప్రకటించిన టాలెంటెడ్ హీరో

Major Movie Release Date: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

Major Movie Release Date
Major Movie

కాగా ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది. తాజాగా అడవిశేష్ ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పుట్టినరోజు. లెజెండ్ జన్మదినోత్సవం సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాము అంటూ ట్వీట్ చేశాడు. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.

Also Read:  సినిమా రిలీజై 15 రోజులు కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా ?

ఇక ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి అని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.

Major Movie Release Date
Major Movie Release Date

అమెరికా నుంచి వచ్చిన పేద కళాకారుడిగా ఎన్నో ఇబ్బందులు పడి నేడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

ఎంతైనా అడివి శేష్ అందగాడు. అందుకే అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయట. అయితే ‘అడివి శేష్’ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని అడివి శేష్ స్వయంగా చెప్పి, తన ఫిమేల్ ఫాలోవర్స్ ను నిరాశ పరిచాడు. మరి ఈ హ్యాండ్సమ్ హీరోని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి గురించి మాత్రం ఇంకా శేష్ ఏ విషయం చెప్పలేదు.

Also Read: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version