Major Movie Release Date: టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ టాలెంటెడ్ హీరోల్లో అడవి శేష్ ఒకరు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ… వరుసగా క్షణం, గూఢచారి, ఎవరు మూవీలతో విజయాలను సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న మూవీ ‘మేజర్’ లో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు.

కాగా ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ చిత్రం ఎట్టకేలకు మే 27న థియేటర్లలోకి రానుంది. తాజాగా అడవిశేష్ ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇచ్చారు. మార్చి 15న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పుట్టినరోజు. లెజెండ్ జన్మదినోత్సవం సందర్భంగా మేము ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాము అంటూ ట్వీట్ చేశాడు. సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు తన ప్రొడక్షన్ హౌస్ లో ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.
Also Read: సినిమా రిలీజై 15 రోజులు కాలేదు.. అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోందా ?
ఇక ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి అని తెలుస్తోంది. ఏది ఏమైనా ‘అడివి శేష్’ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు.

అమెరికా నుంచి వచ్చిన పేద కళాకారుడిగా ఎన్నో ఇబ్బందులు పడి నేడు హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు. జీరో నుంచి మైనస్ లోకి వెళ్లి, ప్రస్తుతం పది కోట్లు మార్కెట్ ను క్రియేట్ చేసుకుని వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు ఈ హీరో. తనకు మాత్రమే సాధ్యం అన్నట్టు వైవిధ్యమైన చిత్రాలతో పేరు తెచ్చుకున్న అడివి శేష్ కి, లేడీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఎంతైనా అడివి శేష్ అందగాడు. అందుకే అమ్మాయిల నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయట. అయితే ‘అడివి శేష్’ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని అడివి శేష్ స్వయంగా చెప్పి, తన ఫిమేల్ ఫాలోవర్స్ ను నిరాశ పరిచాడు. మరి ఈ హ్యాండ్సమ్ హీరోని ప్రేమలో పడేసిన ఆ అమ్మాయి గురించి మాత్రం ఇంకా శేష్ ఏ విషయం చెప్పలేదు.
Also Read: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి