
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మహేశ్ బాబు సినిమాలంటే ఎగబడి మరీ చూస్తారు. అందుకు తగ్గట్టే మహేశ్ సినిమాలను ఎంపిక చేస్తారు. ఆయన నటించిన గత మూడు సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఈ ఈ హీరో మంచి ఫాంలో ఉన్నాడు. దీంతో ఆయన కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారి వారి పాట’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళితో మూవీ అంటున్నారు. అయితే అది క్లారిటీ రాలేదు. కానీ ఈ గ్యాబ్ లో త్రివిక్రమ్ మహేశ్ తో ఓ సినిమా చేయనున్నాడట. ఆ సినిమాకు మహేశ్ తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట.
మహేశ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. వీటిలో ‘అతడు’ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఆ తరువత ఖలేజా అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాపై ఫ్యాన్స్ భారీ ఎక్స్ పెక్టేషన్ పెట్టుకున్నారు. వాస్తవానికి ‘సర్కారు వారి పాట’ సినిమా తరువాత మహేశ్ రాజమౌళితో సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే మూడు సంవత్సరాలు పట్టుద్ది. ఇంతలో త్రివిక్రమ్ మహశ్ తో సినిమా తీయనున్నాడట.
హారికా క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా ఆగస్టులో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మిగతా హీరోల కంటే మహేశ్ హ్యాట్రిక్ విజయాలతో దూకుడు మీద ఉండడంతో ఆయన రెమ్యూనరేషన్ సైతం భారీగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మహేశ్ ఈ సినిమాకు రూ.55కోట్లు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇంత భారీ మొత్తంలో మహేశ్ తీసుకోవడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
దాదాపు 11 ఏళ్ల తరువాత మహేశ్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు #SSMB28 అని పేరు పెట్టారు. దాదాపు ఏడాది పాటు నిర్మాణం జరుపుకొని 2022 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాతో బీజీగా ఉన్న మహేశ్ ఆ సినిమా పూర్తవగానే #SSMB28లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.