Sitara Krishna : సూపర్ స్టార్ కృష్ణ మరణం అందరిని కలచి వేసింది. ఆయన కుమారుడు మహేశ్ బాబు అయితే ఉద్వేగాన్ని ఆపుకున్నారు. ఒకే సంవత్సరంలో ముగ్గురు అన్న జనవరి, తల్లి సెప్టెంబర్, ఇప్పుడు తండ్రి దూరం కావడంతో ఆయన కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఇన్నాళ్లు తాతతో ఆడుకున్న మహేశ్ బాబు కూతురు సితార సైతం తనదైన శైలిలో తాతతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు. తాతయ్యతో గడిపిన రోజులను గుర్తు చేసుకుని బాధ పడింది.

గతంలో లాగా వారాంతపు రోజుల్లో ఎంజాయ్ ఉండదు. వీకెండ్ భోజనం తాతయ్యతో ఉండదని ఆమె చేసిన ట్వీట్ కు నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. తాతయ్యతో ఆడుకోవడం ఉండదని ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ట్వీట్ చేయడంతో ఆమెను ఓదార్చారు. సితార ధైర్యంగా ఉండాలమ్మా అని స్పందించారు. తాతయ్యతో గడిపిన రోజులు ఎంతో విలువైనవిగా గుర్తు చేసుకుంటోంది. తాతయ్య మిమ్మల్ని మిస్సవుతున్నా. భవిష్యత్ లో బాగా ఎదిగి మీ పేరు నిలబెడతానని చెప్పడంతో అందరు విచారం వ్యక్తం చేస్తున్నారు. తాత గురించి ఆమె బెంగ పెట్టుకుందని ఓదార్చుతున్నారు. సితార చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు మహేశ్ బాబు తండ్రి పార్థివ దేహాన్ని చూసి విలపించారు. ఉద్వేగానికి లోనయ్యారు. అశేష జనవాహిని మధ్య కృష్ణ అంత్యక్రియలు జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. తమ అభిమాన నటుడిని కడసారి చూడాలని ఎంతో ఆరాట పడ్డారు. ర్యాలీ వెంట కూడా జన సందోహం కనిపించింది. భద్రత కారణాల దృష్ట్యా లోపలకు ఎవరిని అనుమతించకున్నా బయట ఉండే తిలకించారు. తమ ప్రియతమ హీరోకు కన్నీటితో వీడ్కోలు పలికారు.
అంతకుముందు ఉదయం నుంచి వీఐపీలు చాలా మంది కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు చలన చిత్ర రంగం ఓ ధ్రువతారను కోల్పోయిందని కొనియాడారు. మకుటం లేని మహారాజులా వెండితెరను ఏలిన కృష్ణ తిరిగి రాని లోకాలకు వెళ్లడం అందరిని కలచివేసింది. దీంతో ఆయన అంత్యక్రియలను అశ్రు నయనాలతో ముగించారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంది. మన రాష్ట్రమే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి కూడా చాలా మంది తరలి వచ్చారు.