Aishwarya Rai
Sitara : మహేష్ బాబు కూతురు సితార.. ఐశ్వర్యరాయ్ కూతురుని డామినేట్ చేసిందన్న న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇది హాట్ టాపిక్ గా మారింది. అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆ కథేమిటో చూద్దాం.. ఆసియాలోనే అతిపెద్ద ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహం అత్యంత ఘనంగా జరిగింది. అంతర్జాతీయంగా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖేష్ అంబానీ ఈ వివాహానికి ఏకంగా రూ. 5000 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.
దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్స్, సెలెబ్స్ హాజరయ్యారు. జాన్ సేనా, కిమ్ కర్దాషియాన్ వంటి హాలీవుడ్ స్టార్స్ సైతం హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక రోజుల పాటు జరిగింది. వస్త్రాలు, నగల ధరలు.. అతిథులకు, సన్నిహితులకు ఇచ్చిన విలువైన బహుమతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు. ఓ పదేళ్ల పాటు అనంత్ అంబానీ వివాహం గురించి చర్చ నడుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్, మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. వెంకటేష్ కూడా అనంత్ అంబానీ పెళ్లికి వెళ్లారు.
ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యామిలీ అనంత్ అంబానీ పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహేష్ బాబు బ్లాక్ కలర్ జోధ్ పూర్ డిజైనర్ సూట్ లో మెస్మరైజ్ చేశాడు. ఇక నమ్రత, సితార మ్యాచింగ్ సిల్వర్ కలర్ షరరా డ్రెస్సులు ధరించారు. కాగా పదుల సంఖ్యలో స్టార్స్ పాలొన్న అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో నటులు, సెలెబ్స్ మధ్య మాటలు, పలకరింపులు చోటు చేసుకున్నాయి. ఒకరితో ఒకరు ఫోటోలు దిగారు. సెల్ఫీలకు ఫోజిలిచ్చారు.
కాగా నమ్రత ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్. ఆమెకు అక్కడి స్టార్స్ తో గట్టి పరిచయాలు ఉన్నాయి. పెళ్లిలో పలువురు స్టార్స్ కి సితారను నమ్రత పరిచయం చేసింది. వారితో సితార, నమ్రత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఓ ఫోటో నెటిజెన్స్ విపరీతంగా ఆకర్షించింది. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్యలను సితార, నమ్రత కలిశారు.
ఈ క్రమంలో సితార వారితో సెల్ఫీ దిగింది. సితార సెల్ఫీ తీయగా నమ్రత, ఐశ్వర్య, ఆరాధ్య ఫోజిచ్చారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆరాధ్యను సితార డామినేట్ చేసింది. అందంలో సితారదే పై చేయి అంటూ కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందానికి చిరునామాగా చెప్పుకునే ఐశ్యర్య కూతురినే డామినేట్ చేసిన సితార గ్రేట్ అంటున్నారు. అయితే పసిప్రాయంలో ఉన్న స్టార్ కిడ్స్ మధ్య ఇలాంటి పోలికలు సరికాదని కొందరు వాపోతున్నారు.
మహేష్ బాబు కూతురిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ డెవలప్ చేసుకుంది సితార. ఇంస్టాగ్రామ్ లో సితారను లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఆమె మైంటైన్ చేస్తుంది. 12 ఏళ్ల ప్రాయంలోనే సితార ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసింది. తన ఫస్ట్ యాడ్ కి సితార రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. మొదటి సంపాదన సితార ఛారిటీకి ఖర్చు చేసిందట.
టీనేజ్ కూడా దాటకుండానే సితార కోట్లు సంపాదించడం విశేషం. సితారకు నటి కావాలనే కోరిక గట్టిగా ఉంది. అందుకే ఇప్పటి నుండే సన్నద్ధం అవుతుంది. డాన్స్ లో శిక్షణ తీసుకుంటుంది. సితార ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి..
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
View Author's Full InfoWeb Title: Maheshs daughter sitara dominates aishwarya rais daughter aaradhya