Mahesh Son Gautham Krishna: మన టాలీవుడ్ స్థాయి ని శిఖరాగ్ర స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి’ సిరీస్ ని ఒక సినిమాగా ఎడిట్ చేసి మరోసారి మన ముందుకు ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) పేరుతో నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త సౌండింగ్ తో, ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని సన్నివేశాలను జోడించి, ఆడియన్స్ కి అసలు పాత సినిమాని చూస్తున్నాం అనే అనుభూతి కలిగించకుండా చేసే ప్రయత్నం చేసాడు రాజమౌళి. ఆడియన్స్ కూడా కొత్త సన్నివేశాలు చూసి, కొత్త సినిమాని మరోసారి చూస్తున్న ఫీలింగ్ ని పొందారు. అయితే విదేశాల్లో చదువుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా ఈ చిత్రాన్ని చూసాడు. ఒక ప్రముఖ మీడియా రిపోర్టర్ ఈ సినిమా తాలూకు రెస్పాన్స్ ని కూడా గౌతమ్ ని అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ కానీ, ఆడియన్స్ కానీ గౌతమ్ మాట్లాడడం ఎప్పుడూ చూడలేదు. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారానే చూసారు. ముందుగా విలేఖరి ప్రశ్న అడుగుతూ ‘ఈ బాహుబలి యుఫోరియా ఎలా అనిపిస్తుంది గౌతమ్’ అని అడిగిన ప్రశ్నకు గౌతమ్ సమాధానం చెప్తూ ‘ప్రపంచం లోనే అతి పెద్ద థియేటర్స్ లో ఒకటైన ఇందులో బాహుబలి ని చూడడం ఒక సరికొత్త అనుభూతి. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే, ఈసారి బాహుబలి ని కట్టప్ప ఎందుకు చంపాడు అని తెలుసుకోవడం కోసం రెండేళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత విలేఖరి మరో ప్రశ్న అడుగుతూ ‘ఇప్పుడు మహేష్ బాబు గారితో రాజమౌళి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా గురించి ఫీలింగ్ ఎలా ఉంది?’ అని అడుగుతాడు. దానికి గౌతమ్ సమాధానం చెప్తూ ‘దయచేసి నన్ను దాని గురించి ఏమి అడగకండి..నాకేమి తెలియదు’ అని తప్పించుకున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు ఇలా తమ అభిమాన హీరో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం చూసేందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎప్పటి నుండో ప్రభాస్ మరియు మహేష్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయం లో మహేష్ కొడుకు నుండి బాహుబలి గురించి ఇలాంటి కామెంట్స్ రావడం అభిమానుల్లో కాస్త శాంతవంతమైన వాతావరణం నెలకొనేలా చేశాయి. ఇక గౌతమ్ వాయిస్ ని మొదటి సారి విన్నందుకు మహేష్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ మోడ్ లో ఉన్నారు.
Every second i’m getting goose bumps and it’s mentalll to watch it againnn…
~ SUPERSTAR @urstrulyMahesh‘s
Son GAUTAM shared his experience on #BaahubaliTheEpic#Prabhas #MaheshBabu #BaahubaliTheEpicOn31stOct pic.twitter.com/s7BkIW2atx— Karthikuuu (@Anchor_Karthik_) October 30, 2025