Trivikram- Mahesh Movie: విలన్ గా మహేష్… ఇదేం ట్విస్ట్ సామీ!

త్రివిక్రమ్-మహేష్ మధ్య విభేదాలంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. త్రివిక్రమ్ మీద కోపంతో మహేష్ ఫారిన్ ట్రిప్ కి వెళ్లారని, షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదంటూ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఈ పుకార్లను నిర్మాత నాగవంశీ కొట్టిపారేశారు.

Written By: Shiva, Updated On : May 16, 2023 2:50 pm

Trivikram- Mahesh Movie

Follow us on

Trivikram- Mahesh Movie: హీరో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎస్ఎస్ఎంబి 28 మూవీలో మహేష్ ఊహించని పాత్రలో మెస్మరైజ్ చేయనున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేశారు. హీరో అయ్యాక ఆ ప్రయోగం చేయలేదు. త్రివిక్రమ్ మూవీతో ఆయన ఆ ఫీట్ సాదించనున్నాడట. త్రివిక్రమ్ మహేష్ ని రెండు భిన్నమైన షేడ్స్ లో ప్రజెంట్ చేయబోతున్నాడట. ఈ రెండు పాత్రల్లో ఒకటి నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుందట. అంటే ఎస్ఎస్ఎంబి 28 మహేష్ విలన్ గా కనిపించి షాక్ ఇవ్వనున్నాడట. ఈ మేరకు క్రేజీ బజ్ వినిపిస్తుంది.

గతంలో ఎన్నడూ మహేష్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదు. దీంతో త్రివిక్రమ్ మహేష్ ని సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారట. ఇక ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ జూన్ మొదటి వారంలో మొదలు కానుంది. నిరవధికంగా మూడు నెలలు ప్లాన్ చేశారట. 2024 సంక్రాంతి కానుకగా ఎస్ఎస్ఎంబి 28 విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు యూనిట్ సన్నద్ధం అవుతున్నారు.

త్రివిక్రమ్-మహేష్ మధ్య విభేదాలంటూ ఇటీవల కథనాలు వెలువడ్డాయి. త్రివిక్రమ్ మీద కోపంతో మహేష్ ఫారిన్ ట్రిప్ కి వెళ్లారని, షూటింగ్ లో పాల్గొనేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపడం లేదంటూ ఇండస్ట్రీలో టాక్ నడిచింది. ఈ పుకార్లను నిర్మాత నాగవంశీ కొట్టిపారేశారు. త్వరలో సర్ప్రైజింగ్ అప్డేట్ తో వస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రానికి టైటిల్స్ గా రెండు పేర్లు పరిగణలో ఉన్నాయట. గుంటూరు కారం లేదా అమరావతికి అటు ఇటు అనే టైటిల్స్ పట్ల ఆసక్తిగా ఉన్నారట. ఈ రెండింటిలో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశాలు కలదంటున్నారు. ఎస్ఎస్ఎంబి 28 అనంతరం మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. రాజమౌళి ఈ చిత్ర పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ రూ. 800 నుండి 1000 కోట్లని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే సూచనలు కలవు.