Homeఎంటర్టైన్మెంట్Rukmini Vasanth reacts to obscene reels: రీల్స్ పేరుతో అశ్లీల ఫోటోలు.. ఒక రేంజ్...

Rukmini Vasanth reacts to obscene reels: రీల్స్ పేరుతో అశ్లీల ఫోటోలు.. ఒక రేంజ్ లో ఫైర్ అయిన ‘కాంతారా 2’ హీరోయిన్!

Rukmini Vasanth reacts to obscene reels: సినీ సెలబ్రిటీలు కనిపిస్తే చాలు , ప్రైవేట్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర నుండి మీడియా విలేఖరుల వరకు , ప్రతీ ఒక్కరు ఫోటోలు తీసుకోవడానికి ఎగబడుతుంటారు. అది విమానాశ్రయం అయినా సరే, షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడు అయినా సరే, లేదా ఏదైనా ఈవెంట్స్ లో అయినా సరే వివిధ యాంగిల్స్ ని కవర్ చేస్తూ ఫోటోలు తీస్తుంటారు. కొంతమంది హీరోయిన్స్ ఫోటో షూట్స్ ఇవ్వడానికి సిద్దమే . వాళ్ళు వివిధ భంగిమలు కూడా ఇస్తుంటారు. కానీ కొంతమంది ప్రైవేట్ ఫొటోగ్రాఫర్లు హీరోయిన్స్ నుండి అశ్లీలమైన యాంగిల్స్ లో ఫోటోలు తీస్తుంటారు. ఇలాంటి వారిపై హీరోయిన్ రుక్మిణి వాసంత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చూసేందుకు చాలా సాఫ్ట్ గా , అందరితో చాలా ఫ్రెండ్లీ గా ఉన్నట్లుగా అనిపించే ఈ అమ్మాయిలో ఇంత ఫైర్ ఉందా అని ఆమె వేసిన ట్వీట్ ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె మాట్లాడుతూ ‘నటీమణులను కించపరిచే విధంగా అశ్లీలమైన ఫోటోలు తీస్తూ , దారుణంగా ప్రవర్తించే ఫోటో గ్రాఫర్స్ పై కచ్చితంగా చర్యలు తీసుకొవాలి. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకూడదని, ఆడవాళ్లపై ఇలా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడం కోసం మేము ఒక గ్రూప్ ని ఏర్పాటు చేశాం. అంతే కాకుండా సోషల్ మీడియా లో నటీమణుల గురించి అసభ్య పదజాలం తో సంభాషించే వారిపైన కూడా ఛత్తరమైన చర్యలు తీసుకునేలా మా గ్రూప్ వ్యవహరిస్తోంది. వృత్తి రీత్యా మేమంతా సినిమాల్లో కానీ , బయట కానీ అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో కొంత మంది ఫోటో గ్రాఫర్స్ రాంగ్ యాంగిల్ లో ఫోటోలు తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం అత్యంత నీచమైన చర్య’ అంటూ చెప్పుకొచ్చింది రుక్మిణి వసంత్. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

‘సప్త సాగరాలు ఎల్లో ‘ అనే కన్నడ డబ్బింగ్ సినిమా ద్వారా రుక్మిణి వసంత్ మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి హిట్టై ఆమెకు గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇక గత ఏడాది విడుదలైన ‘కాంతారా 2 ‘ చిత్రం రుక్మిణి వాసంత్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. ఇందులో ఆమె విలన్ గా నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ఒక పక్క కెరీర్ లో బిజీ గా ఉంటూనే, తన తోటి నటీమణుల కోసం ఆమె తీసుకున్న స్టాండ్ ని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version