Mahesh Babu: 2022 మహేష్ జీవితంలో వరస్ట్ ఇయర్. ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాడు. జనవరిలో అన్నయ్య రమేష్ బాబు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అన్నయ్య మరణించిన 9 నెలలకు అమ్మ ఇందిరా దేవి కన్నుమూశారు. ఇందిరా దేవి మరణించిన రోజుల వ్యవధిలో కృష్ణ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వరుస మరణాలు మహేష్ ని కుంగదీస్తాయి. ఆయన కోలుకునేందుకు సమయం పట్టింది.
కాగా తల్లి ఇందిరా దేవికి ఒక కోరిక ఉందట. అది తీరకుండానే ఆమె కన్నుమూశారు. అదేమిటంటే మనవరాలు సితార ఓణీల ఫంక్షన్ తన సమక్షంలో ఘనంగా చేయాలని అనుకున్నారట. ఈ విషయం మహేష్ తో కూడా పలుమార్లు చెప్పారట. అయితే ఇందిరా దేవి కోరిక నెరవేరలేదు. సితార ఓణీల వేడుక నిర్వర్తించ కుండానే ఈ లోకాన్ని విడిచారు. కన్నుమూసిన కన్న తల్లి కోరిక నెరవేర్చాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నారట.
సితార ఓణీల వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారట. భారీగా ఈ వేడుక జరపనున్నారని సమాచారం. టాలీవుడ్ గొప్పగా చెప్పుకునేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారని వినికిడి. సితార ప్రస్తుత వయసు 11 ఏళ్ళు. ఓణీ వేడుకలో సితార ఏంజెల్ లా అద్భుతంగా తయారు కానుందట. మరోవైపు సితారకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మహేష్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది.
సర్కారు వారి పాట చిత్ర ప్రమోషనల్ సాంగ్ లో సితార నటించడం విశేషం. అప్పుడే బ్రాండ్ అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తుంది. ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ పీఎంజే కి సితార ప్రచారకర్తగా ఉంది. ఆ సంస్థ యాడ్ షూట్లో పాల్గొంది. ఇందుకు గానూ సితార రూ. 1 కోటి పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. తన మొదటి సంపాదన సితార ఛారిటీకి ఖర్చు చేసిందట. చూస్తుంటే… అందంతో పాటు గుణంలో కూడా తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది సితార.