https://oktelugu.com/

Mahesh Babu: ఆ సింగర్ కోసం మహేష్ పైరవీలు చేశాడట !

Mahesh Babu: ఎవరేమనుకున్నా సిద్ శ్రీరామ్ కోసం మాత్రం తెలుగు మేకర్స్ ఎదురు చూడక తప్పడం లేదు. స్టార్ ఎవరైనా సింగర్ మాత్రమే అతనే కావాలి. ఈ మధ్య సిద్ శ్రీరామ్ ప్రభ మరీ వెలిగిపోతుంది. అతని కోసం అతని డేట్లు కోసం పైరవీలు కూడా చేయాల్సి వస్తోంది. అరె.. ఒక సింగర్ కోసం స్టార్ హీరో కూడా మేనేజర్ మాట సాయం తీసుకోవడానికి ముందుకు రావడం అంటే ఏమిటి.. కచ్చితంగా ఇది సిద్ శ్రీరామ్ ప్రత్యేకతే. […]

Written By:
  • Shiva
  • , Updated On : January 1, 2022 / 01:03 PM IST
    Follow us on

    Mahesh Babu: ఎవరేమనుకున్నా సిద్ శ్రీరామ్ కోసం మాత్రం తెలుగు మేకర్స్ ఎదురు చూడక తప్పడం లేదు. స్టార్ ఎవరైనా సింగర్ మాత్రమే అతనే కావాలి. ఈ మధ్య సిద్ శ్రీరామ్ ప్రభ మరీ వెలిగిపోతుంది. అతని కోసం అతని డేట్లు కోసం పైరవీలు కూడా చేయాల్సి వస్తోంది. అరె.. ఒక సింగర్ కోసం స్టార్ హీరో కూడా మేనేజర్ మాట సాయం తీసుకోవడానికి ముందుకు రావడం అంటే ఏమిటి.. కచ్చితంగా ఇది సిద్ శ్రీరామ్ ప్రత్యేకతే.

    Mahesh Babu

    సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ సినిమా ‘సర్కారు వారి పాట’. అయితే, ఈ సినిమాలో ఓ పాట ఉంది. ఆ పాట షూట్ కోసం ‘గోవా’ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, పాట మాత్రం ఇంకా పూర్తి కాలేదు. సిద్ శ్రీరామ్ ముందుగా ఇచ్చిన డేట్ లో ట్యూన్ రెడీ అవ్వలేదు. దాంతో సిద్ శ్రీరామ్ డేట్ వేస్ట్ అయింది.

    తీరా ట్యూన్ రెడీ అయ్యేసరికి సిద్ శ్రీరామ్ డేట్ లేదు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్. అందుకే, తమ సినిమా సాంగ్ షూట్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవాలి అని మహేష్ కి చెప్పాడు డైరెక్టర్. కానీ మహేష్ మాత్రం తన పలుకుబడితో మొత్తానికి సిద్ శ్రీరామ్ ను పాట పాడటానికి తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పాట రికార్డింగ్ జరుగుతుంది. మొత్తమ్మీద సిద్ శ్రీరామ్ కోసం ఈ రేంజ్ లో పోటీ ఉండడం నిజంగా గ్రేటే.

    Also Read: బ్రేకప్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శృతి హాసన్… ఫ్యాన్ కి స్ట్రాంగ్ కౌంటర్

    అసలు సిద్ శ్రీరామ్ ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందాడు ? ఒక గాయకుడు ప్రాచుర్యం చెందడానికి.. అతని పాట అందరి నోళ్ళలో నానితే చాలు. సంగీతానికి రసాస్వాదనే ప్రధానం కాబట్టి.. సిద్ శ్రీరామ్ లో అది ప్రధానంగా ఉంటుంది.

    వాస్తవానికి మొదట్లో తమిళ డబ్బింగ్ సినిమా ‘ఐ’ కోసం ‘నువ్వుంటే నా జతగా’ అనే పాటను ‘నువ్వుళ్టే’ అని పాడాడు సిద్. అప్పుడు ఎవడ్రా వీడు తెలుగును ఇట్లా ఖూనీ చేస్తున్నాడు అని కామెంట్స్ చేసిన వారే ఇప్పుడు అతని పాట కోసం ఎదురుచూస్తున్నారు.

    Also Read: ఆ హీరో చేతిలో మోసపోయిన రమాప్రభ.. ఆర్థికసాయం కోసం రజనీ కాంత్ ఇంటికి వెళ్తే..

    Tags