https://oktelugu.com/

Mahesh Babu Waiting For Her Video: ఆమె వీడియోల కోసం మహేష్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు !

Mahesh Babu Waiting For Her Video: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘నీహారిక ఎన్ ఎమ్’ కోసం రెండు వారాల పాటు ఎదురు చూశాడు. పైగా, ఆమె రాక కోసం పదిహేను లక్షలు ఖర్చు చేశాడు. ఇంతకీ ఎవరు ఈ ‘నీహారిక ఎన్ ఎమ్’ ?. ఆమె ఒక యూట్యూబర్. ఒక యూట్యూబర్ కోసం మహేష్ లాంటి సూపర్ స్టార్ వెయిట్ చేయడమా ? ఆమె క్రేజ్ అలాంటిది మరి. యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 30, 2022 / 01:14 PM IST
    Follow us on

    Mahesh Babu Waiting For Her Video: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘నీహారిక ఎన్ ఎమ్’ కోసం రెండు వారాల పాటు ఎదురు చూశాడు. పైగా, ఆమె రాక కోసం పదిహేను లక్షలు ఖర్చు చేశాడు. ఇంతకీ ఎవరు ఈ ‘నీహారిక ఎన్ ఎమ్’ ?. ఆమె ఒక యూట్యూబర్. ఒక యూట్యూబర్ కోసం మహేష్ లాంటి సూపర్ స్టార్ వెయిట్ చేయడమా ? ఆమె క్రేజ్ అలాంటిది మరి. యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా నీహారిక పేరు టాప్ లో ఉంటుంది. నీహారిక వీడియోస్ కోసం యూట్యూబ్ కూడా ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెకు ఉన్న డిమాండ్ అలాంటిది.

    Niharika

    ‘నీహారిక ఎన్ ఎమ్’ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఎంబిఎ చేస్తోంది. అయినా, తన వీడియోలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది నీహారిక. ఆమె వీడియోలకు సూపర్ స్టార్ మహేష్ కూడా పెద్ద ఫ్యాన్. అందుకే, సర్కారు వారి పాట, మేజర్ సినిమా ప్రమోషన్ల కోసం మహేష్ ఆమెను ఏరికోరి మరీ పిలిపించుకున్నాడు. ఆమె చేత ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలు చేయించుకున్నాడు.

    నిన్న వదిలిన మేజర్ టికెట్ ల కోసం మహేష్ క్యూలో నిలబడిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అయ్యింది. సర్కారు వారి పాట టైమ్ లో మహేష్ స్వయంగా నీహారికను పిలిచాడు. పార్క్ హయాత్ హొటల్ లో మహేష్ తాళాల బంచ్ ను దొంగిలించే వీడియోను రూపొందించింది నీహారికనే. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. తాజాగా మేజర్ సినిమా కోసం చేసిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది.

    Mahesh Babu, Adivi Sesh

    Also Read: Hero Daughter Glamor Treat: హీరోగారి కూతురు గ్లామర్ ట్రీట్: అందాల ఆరబోతతో షేక్ చేసి పడేసింది !

    అసలు మహేష్ లాంటి హీరో కూడా, నీహారిక వీడియోలకు ఫ్యాన్ అయ్యాడు అంటే కారణం ఒక్కటే. నిహారిక చేసే ప్రమోషన్ వీడియోలు చాలా సహజంగా ఉంటాయి. ఏ సినిమా కోసం అయితే ఆమె వీడియో చేస్తోందో.. ఫస్ట్ ఆ సినిమా కంటెంట్ కి తగ్గట్టే వీడియోలను ప్లాన్ చేస్తోంది. ఆమె ఐడియాలు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అన్నిటికి మించి చాలా క్యూట్ గా వీడియోలు ప్లాన్ చేయడం నీహారిక స్పెషాలిటీ. అందుకే ఆమె వీడియోలు కోసం మహేష్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు.

    Mahesh Babu

    Also Read: TDP Rebel MLAs: టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు పొమ్మనలేక పోగా.. పూర్వాశ్రమం వైపు వారి చూపు

    Recommended Videos:


    Tags