CM Jagan- YCP Plenary: ఎన్నికలపై సీఎం జగన్ ప్రకటన.. సెంటిమెంట్ కంటిన్యూ చేస్తారా?

CM Jagan- YCP Plenary: వైసీపీ పండుగ ‘ప్లీనరీ’కి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017లో జరిగిన ప్రదేశంలోనే మరోసారి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు ప్రతినిధుల సభ.. రెండో రోజు పార్టీ విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. చివరి రోజు పార్టీ అధినేత జగన్ ప్రసంగించనున్నారు. ప్లీనరీకి సంబంధించి అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మినీ ప్లీనరీలతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జన సమీకరణకు సన్నాహాలు పూర్తిచేశారు. మరోవైపు కార్యక్రమ […]

Written By: Dharma, Updated On : July 7, 2022 10:17 am
Follow us on

CM Jagan- YCP Plenary: వైసీపీ పండుగ ‘ప్లీనరీ’కి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2017లో జరిగిన ప్రదేశంలోనే మరోసారి నిర్వహిస్తున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు ప్లీనరీ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు ప్రతినిధుల సభ.. రెండో రోజు పార్టీ విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. చివరి రోజు పార్టీ అధినేత జగన్ ప్రసంగించనున్నారు. ప్లీనరీకి సంబంధించి అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మినీ ప్లీనరీలతో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జన సమీకరణకు సన్నాహాలు పూర్తిచేశారు. మరోవైపు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించారు. కమిటీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగింపులో జగన్ ప్రసంగించనున్నారు. కీలక ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తూనే.. ఎన్నికలు ఎప్పుడన్నది అధినేత క్లారిటీ ఇవ్వనున్నారు. ముందస్తుగా వెళతారా? లేకుంటే ప్రభుత్వం గడువు ముగిసిన తరువాత వెళతారా? అన్న దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్లీనరీ వేదికగానే జగన్ రాజకీయ ప్రకటనలు చేస్తూ వచ్చారు. తొలుత విశాఖలో నిర్వహించాలని భావించినా.. 2017లో నిర్వహించిన ప్రదేశం కలిసి రావడంతో.. ఈ సారి కూడా అక్కడే ప్లీనరీ ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావం తరువాత 2011లో జూలై 8,9 తేదీల్లో ప్లీనరీ ఏర్పాటుచేశారు. అటు తరువాత 2017లో ప్లీనరీని నిర్వహించారు.

CM Jagan

కీలక ప్రకటనలు..
ఒక విధంగా పార్టీకి మైలేజ్ తెచ్చే అన్ని కార్యక్రమాలు ప్లీనరీ వేదిక నుంచి ప్రకటించినవే. 2017 ప్లీనరీలో జగన్ తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసొచ్చాయి. పాదయాత్ర నిర్వహణపై తొలి ప్రకటన చేసింది అక్కడ నుంచే. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అటు నవరత్నాలను కూడా ఇదే వేదిక మీద నుంచి ప్రకటించారు. అవి కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. అలాగే పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను కూడా ఇదే వేదిక మీద నుంచి పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. పీకే టీమ్ కూడా జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. ఇప్పటికీ పీకే ఇండైరెక్ట్ గా జగన్ కోసం పనిచేస్తున్నారు. తన పాత బ్రుందంలోని సభ్యులకే బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో కొద్దిరోజులుగా ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు రేగుతున్న వేళ.. దానిపై జగన్ ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 2023 చివర్లో ఎన్నికలకు వెళతారని వైసీపీ శ్రేణులు సైతం భావిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత ఇచ్చి శ్రేణులను అలెర్ట్ చేసే అవకాశముంది.

Also Read: Electric Meters Agricultural Pump Sets: ఏపీ సర్కారుకు షాకిచ్చిన కేంద్రం.. జగన్ నిండా మునిగాడా?

సీఎం బిజీబిజీ..
ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటారు. గురువారం సాయంత్రం ఆయన ఇడుపులపాయ వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. శుక్రవారం ఉయదం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్లీనరీకి బయలుదేరనున్నారు. ఉదయం 10.10 గంటలకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు.10.50 గంటలకు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రకటనను సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ ప్రసంగించనున్నారు. శుక్రవారం మహిళా సాధికారత, దిశ, వైద్యం, విద్య, ప్రత్యక్ష నగదు బదిలీ, పరిపాలనలో పారదర్శకత అనే ఐదు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శనివారం నాడు జగన్ ముగింపు ఉపన్యాసం ఇస్తారు. ఇప్పటికే ప్రతీ గ్రామంలోను వైసీపీ క్రయాశీలక నాయకులకు జగన్ పేరిట ఆహ్వాన లేఖలను పంపించారు. ప్రతీ గ్రామానికి భాగస్వామ్యం కల్పించారు.

CM Jagan

విజయమ్మ రాకపై…
వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్లీనరీకి హాజరవుతారా? లేదా ? అన్న అనుమానాలు వైసీపీ శ్రేణుల్లో ఉన్నాయి. వస్తే ఆమె ప్రసంగం ఎలా ఉండబోతున్నది అన్నది చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా కుటుంబంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. సోదరుడు జగన్ ను విభేదిస్తూ సోదరి షర్మిళ తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీని ఏర్పాటు చేశారు. చాలారోజులు వారిద్దరు కలిసిన సందర్భాలు లేవు. తల్లి విజయమ్మ సోదరి షర్మిళను సపోర్టు చేస్తోందన్న ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకానొక దశలో విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారన్న టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో ప్లీనరీ జరుగుతుండడంతో మొత్తం పరిణామాలపై ఆమె క్లారిటీ ఇచ్చే అవకాశముందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Also Read:Kishan Reddy- Pawan Kalyan: కిషన్ రెడ్డి పిలిచినా పవన్ వెళ్లలేదా? కారణమేంటి?

Tags