https://oktelugu.com/

త్రివిక్రమ్ తాపత్రయమే మహేష్ భయం !

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు. కాగా వచ్చే వారం నుండి ఈ సినిమా సంగీత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌, త్రివిక్రమ్ కి పదిరోజుల పాటు డేట్స్ కూడా ఇచ్చాడు. ఇక తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ డిజైన్ చేయడం త్రివిక్రమ్ కి అలవాటు. ఆ అలవాటునే ఈ సినిమా కోసం కూడా కొనసాగిస్తున్నాడు. అన్నట్టు ఈ […]

Written By:
  • admin
  • , Updated On : July 5, 2021 / 09:24 AM IST
    Follow us on

    సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు. కాగా వచ్చే వారం నుండి ఈ సినిమా సంగీత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే, సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌. తమన్‌, త్రివిక్రమ్ కి పదిరోజుల పాటు డేట్స్ కూడా ఇచ్చాడు. ఇక తన ప్రతి సినిమాలో ఓ ప్రత్యేక సాంగ్ డిజైన్ చేయడం త్రివిక్రమ్ కి అలవాటు.

    ఆ అలవాటునే ఈ సినిమా కోసం కూడా కొనసాగిస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమాని అక్టోబర్ 18 నుండి మొదలు పెట్టాలని ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. రీసెంట్ గా త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీయాలనేదే త్రివిక్రమ్ తాపత్రయం. కానీ, త్రివిక్రమ్ కి పక్కా యాక్షన్ మూవీ వర్కౌట్ అవదు అనేది మహేష్ భయం.

    అందుకే మహేష్, ఫుల్ యాక్షన్ కి నో అన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. కాకపోతే, త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడట. పైగా ఈ సినిమా రెండు బలమైన నేపథ్యాలు ఉంటాయట.

    ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. మరి మహేష్ ఒప్పుకుంటాడా ? ఎలాగూ మాటలతో కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ కి పెన్ తో పెట్టిన విద్య. మరి ఈ మాటల మాంత్రికుడు ఈసారి తన విద్యను ఎంతవరకు ప్రయోగిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు.

    సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం. మరో కథానాయికగా పూజా హెగ్డేనే తీసుకోవాలని త్రివిక్రమ్ ఆశ పడుతున్న వ్యవహారం గురించి తెలిసిందే.