Guntur Kaaram: మహేష్ బాబు సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. గుంటూరు కారం మిక్స్ట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. గుంటూరు కారంతో మహేష్ బాబు కెరీర్ బెస్ట్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. కాగా మహేష్ బాబు తన ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశాడు. అభిమానుల మధ్య గుంటూరు కారం మూవీ వీక్షించాడు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సుదర్శన్ 35 ఎంఎం లో మహేష్ బాబు కుటుంబంతో పాటు గుంటూరు కారం మూవీని చూశారు. భార్య నమ్రత శిరోద్కర్, కొడుకు గౌతమ్, కూతురు సితార వీరితో జాయిన్ అయ్యారు. అలాగే మహేష్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నారు. వంశీ పైడిపల్లి సైతం వీరితో కలిసి సినిమా చూశారు. మహేష్ బాబు రాకతో థియేటర్ దద్దరిల్లింది. ఫ్యాన్స్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
గుంటూరు కారం షో ముగిశాక భారీ సెక్యూరిటీ మధ్య మహేష్ బాబు కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు ఊరమాస్ రోల్ చేశాడు. బీడీ తాగుతూ గతంలో ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్ లో అలరించాడు. మహేష్ క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలిచాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిందని ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
గుంటూరు కారం మూవీ మహేష్ బాబు వన్ మ్యాన్ షో అని చెప్పాలి. మదర్ సెంటిమెంట్ ప్రధానంగా మూవీ తెరకెక్కింది. రమ్యకృష్ణ మహేష్ బాబు మదర్ రోల్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్ ఇతర కీలక పాత్రలు చేశారు. థమన్ సంగీతం అందించారు.
Mahesh Babu and Trivikram watching #GunturKaaram at Sudarshan 35MM. #MaheshBabu #Trivikram #GunturKaaramReview#GunturKaraamReview pic.twitter.com/VQIelmnYsE
— Scroll And Play (@scrollandplay) January 12, 2024