https://oktelugu.com/

Guntur Kaaram Movie : వైఎస్ జగన్ తో మహేష్.. షేకింగ్ వీడియోని షేర్ చేసిన మహేష్ బాబు భార్య నమ్రత

వీడియోని పోస్ట్ చేస్తూ మహేష్ బాబు భార్య అయిన నమ్రత తన ఇన్ స్టా లో గుంటూరు కారం సినిమా టీం కి కంగ్రాట్స్ తెలియజేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : January 12, 2024 / 09:59 PM IST
    Follow us on

    Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా ఇవాళ్ళ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేస్తూ మహేష్ బాబు భార్య అయిన నమ్రత తన ఇన్ స్టా లో గుంటూరు కారం సినిమా టీం కి కంగ్రాట్స్ తెలియజేశారు.

    ఇక అదే విధంగా మరొక వీడియోలో గుంటూరు కారం సినిమా సాంగ్ మీద మహేష్ బాబు తో పాటు జగన్ ఉన్న ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియో పెట్టిన కొద్దిసేపటికి ఆమె ఆ వీడియోను డిలీట్ చేసింది.ఇక ఇప్పుడు ఇది పొలిటికల్ గా బాగా వైరల్ గా మారుతుంది.ఇక దీన్ని బట్టి మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ జగన్ కి సపోర్ట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి.మరి నమ్రత ఆ వీడియోను ఎందుకు పోస్ట్ చేసింది మళ్ళీ ఎందుకు డిలీట్ చేసింది అన్న విషయాల మీద సరైన క్లారిటీ అయితే లేదు కానీ జగన్ కి మహేష్ బాబు కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనే విధంగా ఈ వీడియో ను పోస్ట్ చేయడం వెనుక కారణమేంటి అనేది హాట్ టాపిక్ గా మారింది.

    అయితే నమ్రత మహేష్ బాబు ఇద్దరు జగన్ కి సపోర్ట్ చేస్తున్నారా అంటూ ఆమె మీద కామెంట్లు చేస్తున్నారు.ఇక ఆవిడ ఆ వీడియో ని ఎందుకు పోస్ట్ చేసిందో తెలియదు గాని ఈ విషయం మీద మాత్రం భారీ చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆమె జగన్ కి సపోర్ట్ చేస్తుంది అందుకే ఆ పోస్ట్ చేసింది అంటూ ప్రతిపక్ష నేతలు సైతం ఆమె మీద సోషల్ మీడియాలో కొంచెం సీరియస్ అవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వైసిపి కార్యకర్తలు మాత్రం ఈ విషయం మీద పండుగ చేసుకుంటున్నారు.

    అంటే మహేష్ బాబు ఇన్ డైరెక్ట్ గా తనకే తమ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ వాళ్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి నిజానికి ఆమె ఈ వీడియో ఎందుకు పెట్టిందో తన స్పందిస్తే తప్ప వీటికి తెర పడే అవకాశాలు అయితే లేవు…