spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Son: హీరోగా మహేష్ కొడుకు గౌతమ్.. అలా హింట్ ఇచ్చేశారా?

Mahesh Babu Son: హీరోగా మహేష్ కొడుకు గౌతమ్.. అలా హింట్ ఇచ్చేశారా?

Mahesh Babu Son: మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి(Rajamouli) సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. కొన్ని రోజులుగా మేకోవర్ సాధించే పనిలో ఉన్నారు. మహేష్ బాబు తన లుక్, మేక్ ఓవర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) చెప్పారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపై క్లారిటీ లేదు.

ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయితే సినిమా కంప్లీట్ అవ్వడానికి కనీసం మూడేళ్లయినా పడుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహేష్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ కొడుకు గౌతమ్(Gautam) గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్.

గౌతమ్ ఘట్టమనేని అమెరికన్ యూనివర్సిటీలో చదువుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో తన గ్రాడ్యుయేషన్ డేలో సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఇక తన కొడుకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినందుకు మహేష్ బాబు అత్యంత సంతోషం వ్యక్తం. ‘గర్వంతో నా హృదయం నిండిపోతుంది .. కంగ్రాట్స్ గౌతమ్ .. మున్ముందు కూడా ఇలానే ఎదుగుతూ ఉంటావు అని నాకు తెలుసు .. నీ కలల్ని వెంటాడుతూనే ఉండు.

నేను తండ్రిగా ఈ రోజు ఎంతో గర్వపడుతున్నాను’ అని మహేష్ బాబు పోస్ట్ షేర్ చేశారు. దీనిపై నమ్రత సైతం స్పందించారు. కాగా గౌతమ్ చదువు పూర్తి అయిన నేపథ్యంలో అతడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలో నమ్రత… గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై స్పందించారు. గౌతమ్ చదువుకుంటున్నాడు. చదువు పూర్తి అయ్యాక హీరో అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కాబట్టి గౌతమ్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సమయం దగ్గర పడిందని చెప్పొచ్చు.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper